వీడు మామూలోడు కాదు.. అనకుండా ఉండలేం

0ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాకు సంబంధించిన విషయాల కంటే ఆమె పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువ కథనాలు వెలువడుతున్నాయి. చాలా కాలం తరువాత అమ్మడు తన హాలీవుడ్ ప్రియుడిని ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తనకంటే చిన్న వాడైన నిక్ జోనస్ తో ప్రియాంక డేటింగ్ చేస్తున్న సంగతి పక్కన పెడితే.. ఆ సైడ్ నుంచి మరో న్యూస్ వైరల్ అవుతోంది.

నిక్ జోనాస్ ఇంతకుముందు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేసినట్లు హాలీవుడ్ లో అనేక రూమర్స్ వచ్చాయి. అఫీషియల్ గా ఈ పాతికేళ్ల కుర్రాడు డేటింగ్ చేసిన లిస్ట్ ను చూస్తే.. ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది.

1. సింగర్ మిలీ సైరస్ అతని మొదటి ప్రేమ. 2006 లో ఆమెతో డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఇక 2007 లోనే బ్రేకప్ అయ్యింది.

2. 2008లో సెలీనా గోమెజ్ తో లవ్ స్టోరీని స్టార్ట్ చేసి రెండేళ్లకే ఎండ్ కార్డ్ పెట్టేశాడు..

3. ఆస్ట్రేలియన్ సింగర్ డెల్టా గూడ్రెమ్ తో నిక్ 10 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయారు.

4. మాజీ మిస్ యూనివర్స్ ఒలీవియా కొల్పొ తో 2015 లో డేటింగ్ మొదలెట్టి 2015 కి క్లోజ్ చేశాడు.

5. కెండాల్ జెన్నర్ తో 2015 ఆగస్టు లో ఒకటయ్యి తొందరగానే బ్రేకప్ చెప్పేశాడు.

6. తనకంటే 14 ఏళ్ళు పెద్దదైన ఉన్న యాక్టర్ కెట్ తో 2015 సెప్టెంబర్ లో నిక్ డేటింగ్ చేశాడు.

7. 2016 ఫిబ్రవరిలో లిలీ కొలిన్స్ తో రొమాన్స్ స్టార్ట్ చేసి.. కలిశారు అనే లోపే విడిపోయారు.

8. నవంబర్ 2017 నుంచి జార్జియా అనే అమ్మాయితో డేటింగ్ చేసిన నిక్ కొన్ని నెలల క్రితం విడిపోయాడు.

9. ఇక ఇప్పుడు ఫైనల్ గా మే 2018 నుంచి ప్రియాంక చోప్రా తో డేటింగ్ స్టార్ట్ చేశాడు. మరి ఈ రిలేషన్షిప్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

ఏదేమైనా కూడా.. వీడు మామూలోడు కాదు.. అని అనకుండా ఉండలేం బాబూ!!