పాతికేళ్ల కుర్రాడితో ప్రియాంకా ప్రేమ!

0ప్రేమ గుడ్డిది అనే సామెత ఊరికే పుట్టలేదు. దాని వెనుక ఎన్నో కథలు ఉంటాయి. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఇందులో కూడా తన మార్క్ ఉండాలని కాబోలు తనకన్నా పదేళ్లకు పైగా చిన్న వయసున్న నిక్ జోసన్ అనే నటుడు కం పాప్ సింగర్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఆ మధ్య లాస్ ఏంజిల్స్ లోని ఒక బేస్ బాల్ స్టేడియంలో ఇద్దరు కలిసి మ్యాచ్ చూడటం సరదాగా కలిసి తిరగడం ఒకరికొదరు చనువుగా ఉండటం మీడియా కంట్లో పడింది. కాకపోతే అక్కడ మన మీడియా కాదు కనక బయటికి రావడానికి కొంత సమయం పట్టింది. నిక్ జోసన్ వయసు పాతికేళ్ళు కూడా దాటలేదు. కెరీర్ ఇప్పుడిప్పుడే సెట్ చేసుకుంటున్నాడు. ప్రియాంకా చోప్రా చూస్తేనేమో కెరీర్ లో అన్ని చూసేసింది. స్టార్ హీరోలందరితోను నటించి 40 వయసుకు దగ్గరలో ఉంది. మరి ఈ ఇద్దరికీ లంకె ఎలా కుదిరింది అంటే అదే ప్రేమ మహత్యం మరి.

ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏడాది దాటేసింది. ఐదారుసార్లు పబ్లిక్ ఫంక్షన్స్ కు కలిసే వెళ్లారు. క్వాంటికో సిరీస్ కోసం చాలా కాలం అమెరికాలో ఉన్న ప్రియాంకా చోప్రా మూడో సీజన్ కు రేటింగ్స్ రావని తేలిపోవడంతో నిర్వాహకులు ఆపేసారు. అది జరుగుతున్నన్ని రోజులు మొత్తం నిక్ తోనే డేటింగ్ చేస్తూ గడిపిందని బాలీవుడ్ మీడియాలో నిజమనిపించే పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. గాలా రెడ్ కార్పెట్ లో ఇద్దరు కలిసి స్టిల్ ఇచ్చినప్పటి నుంచి ఇది హాట్ టాపిక్ గా మారింది. అదేంటి అతనితో అంత చనువుగా ఫోటో దిగావు అని అడిగితే అతనేమీ పదకొండేళ్ల పిల్లాడు కాదుగా అంటూ గడుసుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం భరత్ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ గా ఎంపికైన ప్రియాంకా చోప్రా చేతిలో అదొక్క సినిమా మాత్రమే ఉంది. అది కూడా సోలో హీరోయిన్ గా కాదు లెండి. కత్రినా కైఫ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి. తాను నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా రామ్ చరణ్ తో చేసిన తూఫాన్. ఆ తర్వాత మళ్ళి సౌత్ లో కనిపించలేదు ప్రియాంకా.