ప్రియాంక చోప్రా బ్యాగ్‌ ధర ఎంతో తెలుసా..!

0బాలీవుడ్ భామ, ‘క్వాంటికో’ నటి ప్రియాంకా చోప్రా పాప్ సింగర్, హాలివుడ్‌ యాక్టర్‌ నిక్ జోనాస్‌తో ప్రేమల మునిగితేలుతున్నారన్న వార్తలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవలే నిక్‌ బంధువుల పెళ్లి వేడుకలో ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ చెట్టాపట్టాలేసుకొని దర్శనమివ్వడం పుకార్లకు మరింత బలం చేకూర్చింది.

అదీ కాక రీసెంట్‌గా వీరిద్దరూ న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేశారు. ఇద్దరూ డిన్నర్‌ చేసి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఇంకేముంది వీరిద్దరి ప్రేమాయణం నిజమేనని ఫ్యాన్స్‌ అంతా ఫిక్సయ్యారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి దృష్టి ఫోటోలో ఉన్న ప్రియాంక బ్యాగ్‌పై పడింది. వెరైటీ డిజైన్‌తో చూడడానికి కొత్తగా ఉన్న ఆ బ్యాగ్‌ అందరి దృష్టి ఆకర్షించింది. అయితే ఆ బ్యాగ్‌ ధర చూసి నెటిజన్లు అంతా షాకవుతున్నారు. ఆమె బ్యాగ్‌ ధర ఎంతో తెలిస్తే మీరు కూడా బ్యాగ్‌ సైడ్‌ ఓ లుక్‌ వేస్తారు మరీ.

ఆ బ్యాగ్‌ ధర దాదాపు 4.6లక్షల రూపాయలు. ఆ ధరతో ఏకంగా ఓ కారే కొనొచ్చు. టియాగో కారు విలువ దాదాపు రూ.3.56 లక్షలు. అంటే ప్రియాంక బ్యాగ్‌ కంటే తక్కువే. దీంతో ఆ జంటతో పాటు ఆమె బ్యాగ్‌ ఫోటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.