షారుక్ కి షాకిచ్చిన ప్రియాంక

0Shah-rukh-khan-priyankaబాలీవుడ్‌లో సూపర్ స్టార్ షారుక్ ఖాన్, మాజీ మిస్ ఇండియా, సినీ నటి ప్రియాంక చోప్రా ఇద్దరూ మంచి స్నేహితులు. దాదాపు 17 ఏళ్ల క్రితం వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

2000 సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా పోటీలకు షారుక్ ఖాన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆ సందర్భంగా ప్రియాంక చోప్రాను ఓ ప్రశ్నను అడిగాడు.

అందాల పోటీల వేదికపై నిలుచున్న ప్రియాంకను అడిగిన ప్రశ్నే ఏమిటంటే.. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. క్రికెటర్ అజర్ భాయ్ లాంటి క్రీడాకారుడ్ని పెళ్లి చేసుకొంటావా లేదా స్వారోస్కీ లాంటి వ్యాపారవేత్తను వివాహమాడుతావా లేదా నా లాంటి హిందీ హీరోను పెళ్లి చేసుకుంటావా అని షారుక్ అడిగారు. మూడు రంగాలకు సంబంధించిన వారిలో ఎవర్ని ఎంపిక చేసుకొంటావు అని ప్రశ్నించారు.

షారుక్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం ఇస్తూ నేను భారతీయ క్రీడాకారుడిని పెళ్లి చేసుకొంటాను అని జవాబు ఇవ్వడం బాలీవుడ్ బాద్‌షాకు షాకిచ్చినట్టయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రియాంక చోప్రా షారుక్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించింది. షారుక్, ప్రియాంకల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి.