చూపించడంలో సిగ్గుపడని ప్రియాంక

0Bikini-clad-Priyanka-Chopra-takes-a-dipహాలీవుడ్‌లో తన మొదటి సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద ఫైర్‌ పుట్టించాలని ప్రియాంక చోప్రా డిసైడ్‌ అయినట్టుంది. క్వాంటికో అనే టెలివిజన్‌ సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన పిసి ‘బేవాచ్‌’తో హాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోవాలని చూస్తోంది.

Priyanka Chopra Bikini Stills at Miami Beach

ఒక ఇండియన్‌ స్టార్‌ హాలీవుడ్‌లో పాగా వేయడమనేది అంత ఈజీ వ్యవహారం కాదు కనుక తనని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి ‘బేవాచ్‌’ థీమ్‌నే ప్రియాంక రియల్‌ లైఫ్‌లో అప్లయ్‌ చేస్తూ తన చిత్రానికి ప్రచారం కల్పిస్తోంది. ‘బేవాచ్‌’ అంటేనే బీచ్‌లో బికినీల్లో అందాల భామలు తిరగడం కనుక ప్రియాంక అదే ఫాలో అవుతూ రోజుకో బీచ్‌లో బికినీలో కనిపిస్తోంది. నల్ల బికినీలో ఆమె చేసిన రచ్చ మర్చిపోకముందే, ఇప్పుడు నీలం-తెలుపు మిశ్రమ బికినీతో మరోసారి ప్రియాంక తన చిత్రానికి ఫుల్‌ పబ్లిసిటీ తెచ్చుకుంది.

బాలీవుడ్‌ తారలకి బికినీలు కొత్త కాకపోయినా కానీ మరీ ఈ స్థాయిలో మునుపెవరూ కనిపించలేదు. హాలీవుడ్‌ మాటేమో కానీ ఇండియాలో తన చిత్రానికి జనం బారులు తీరేట్టు ప్రియాంక జాగ్రత్త పడుతోంది. దీపిక పడుకోన్‌ హాలీవుడ్‌ డెబ్యూ క్లిక్‌ అవకపోవడంతో, తన చిత్రానికి అలాంటి ఫేట్‌ ఎదురు కాకుండా ప్రియాంక కేర్‌ తీసుకుంటోంది. హాలీవుడ్‌లో పాగా వెయ్యాలనే తన ఆరాటం చూస్తే ముందు ముందు ప్రియాంక వెండితెరపై ఇంకెన్ని హద్దులు దాటుతుందో అనిపించడం లేదూ?