అమెరికా కోడలు మెరుపులే

0

ప్రఖ్యాత అమెరికన్ గాయకుడు.. నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. అంతర్జాతీయ మీడియాలో పీసీ హల్ చల్ గురించి తెలిసిందే. ప్రముఖ చానెళ్ల లైవ్ ఇంటర్వ్యూల్లో ప్రియాంక చోప్రా ఫ్యాషన్ గురించి అందం గురించి వేడెక్కించే డిబేట్ రన్ అయ్యింది. తనకంటే పదేళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్ ని పీసీ పెళ్లాడడం హాట్ టాపిక్ గా మారింది లైవ్ ఇంటర్వ్యూల్లో. మరోవైపు కొత్తకోడలితో నిక్ ఫ్యామిలీ అనుబంధానికి సంబంధించి వాడి వేడిగా చర్చ సాగుతోంది.

తాజాగా పీసీ సామాజిక మాధ్యమాల్లో నిరంతర అప్ డేట్స్ గురించి అభిమానుల్లో చర్చ సాగుతూనే ఉంది. లేటెస్టుగా రివీల్ చేసిన న్యూ లుక్ పై అభిమానులు వ్వావ్ అంటూ పొగిడేస్తున్నారు. బ్లాక్ కలర్ లో స్పెషల్లీ డిజైన్డ్ డ్రెస్ లో పీసీ అలా వీధుల్లో నడిచి వెళుతుంటే… ఆ హావభావాల్ని కెమెరాలో బంధించారు. ఆ ఫోటోల్ని పీసీ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేసింది. పీసీ న్యూ లుక్ కేకలే అంటూ పొగిడేస్తున్నారంతా. ఓ అభిమాని అయితే పీసీ జబర్ధస్త్ మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశాడు.

ముఖ్యంగా టాప్ టు బాటమ్ పీసీ డ్రెస్ కోడ్ ఇంప్రెస్సివ్. ఆ కాలికి ఉన్న హైహీల్స్ సైతం బ్లాక్ వే ఎంపిక చేసుకుంది. పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేస్తున్న ఈ డ్రెస్ ఖరీదు అంతే షాకిస్తుందని తెలుస్తోందట. ఇటీవలే నిక్ జోనాస్ ఫ్యామిలీ రిలీజ్ చేసిన ఓ ఆల్బమ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఆనందంలో నిక్ ఏకంగా 2.7 కోట్లు పెట్టి మెర్సిడెస్ బెంజ్ క్లాస్ కార్ ని పీసీకి గిఫ్ట్ గా ఇచ్చాడట. పీసీ నటించిన ఇజింట్ ఇట్ రొమాంటిక్ చిత్రం ఇటీవలే రిలీజై ఘనవిజయం సాధించింది. తదుపరి ది స్కై ఈజ్ పింక్ బాలీవుడ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
Please Read Disclaimer