మరో హాలీవుడ్ మూవీలో ప్రియాంక

0Priyanka-Chopra-Bikiniహాలీవుడ్ లో వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా.. ఇప్పుడు తన హాలీవుడ్ అరంగేట్ర మూవీ బేవాచ్ కు ప్రమోషన్స్ లో తెగ బిజీబిజీగా ఉంది. ఈ నెల 25న విడుదల కానున్న బేవాచ్ మూవీపై ప్రియాంక చాలానే హోప్స్ పెట్టుకుంది. సహజంగా మన దగ్గర అయితే.. ఇలా అరంగేట్రం చేసేటపుడు.. మరో అవకాశం రావడం అనే పాయింట్.. తొలి చిత్రం జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.

కానీ హాలీవుడ్ రూటు వేరు.. ప్రియాంక కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది కదా.. అందుకే బేవాచ్ మూవీ రిలీజ్ కి ఇంకా 10 రోజులు ఉండగానే.. కొత్త సినిమాపై ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని పీసీ కన్ఫాం చేయలేదు కానీ.. నిర్మాత పాల్ బెర్నాన్ మాత్రం అఫీషియల్ గానే కొత్త ప్రాజెక్ట్ పై అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. ‘నేను ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాను. జిమ్.. క్లారీ.. ఆక్టేవియా స్పెన్సర్.. ప్రియాంక చోప్రా.. మైకెలా వాట్’ అంటూ ట్వీట్ చేశాడు పాల్. సిలాస్ హోవార్డ్స్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో.. ఆక్టేవియా స్పెన్సర్స్.. జిమ్ పార్సన్స్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ న్యూయార్క్ లో ప్రారంభం కానుంది. ఏ కిడ్ లైక్ జాక్ అనే నాటకం ఆధారంగా ఈ చిత్ర కథ రూపొందించారు. పిల్లలు-పెద్దలు మధ్య రిలేషన్స్ బేస్డ్ గా ఉండి.. కంప్లీట్ ఎమోషన్స్ ను క్యారీ చేయడం ఆ కాన్సెప్ట్ స్పెషాలిటీ. ఈ ప్రాజెక్టులో తన పాత్రపై త్వరలోనే ప్రియాంక నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.