ఖరీదైన పెళ్లిళ్లకు లగ్గమెట్టేశారా?

0

అనుష్క శర్మ – శ్రీయ – సోనమ్ కపూర్ – శ్రీయ భూపాల్ .. వీళ్లంతా పెళ్లిళ్లు స్వర్గంలో చేసుకున్నారు. ఖరీదైన స్టార్ హోటళ్లు – ఎగ్జోటిక్ లొకేషన్లు ఈ భామల పెళ్లిళ్ల కోసం పందిళ్లుగా మారాయి. పెళ్లికి బాజా మోగునులే అని ఫ్యాన్స్ మాటా మంతీ సాగిస్తుండగానే వన్ ఫైన్ డే మాంగళ్యం తంతునామేనా! అంటూ మంత్రాలు – మేళ తాళాల మధ్య తాళి కట్టించుకుని ఇదిగో ఇదే మా పెళ్లి! అంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటో లీకు లిచ్చి అభిమానుల్ని ఉస్సురనిపించారు.

అందుకే ఈసారి కూడా ఆ రెండు ఖరీదైన పెళ్లిల్లు కూడా అలానే అవుతాయా? అంటూ అభిమానులంతా కంగారు పడిపోతున్నారు. సమంత- నాగచైతన్య వివాహం మాత్రం అభిమానులకు ముందే బాగా తెలిశాకే జరిగింది. ఆరురోజుల డెస్టినీ వెడ్డింగ్ అలరించింది. ఆ జంట ఉల్లాస ఉత్సాహభరితమైన పోస్ట్ వెడ్డింగ్ లైఫ్ స్టైల్ అన్నివేళలా హాట్ టాపిక్. ఆదర్శ జంటగా వెలిగిపోతున్నారు. ఈ పెళ్లిళ్లలో సోనమ్ కపూర్ పెళ్లి మాత్రం కాస్త విషాదం నడుమ సైలెంట్ గా సాగింది. కజిన్ శ్రీదేవి మరణం ఈ పెళ్లిలో హైప్ లేకుండా చేసింది.

ఇకపోతే .. ప్రస్తుతం పీసీ-నిక్ జోనాస్ .. దీపిక-రణవీర్ (దీప్ వీర్) పెళ్లిళ్ల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. 2018 నవంబర్ లోనే ముహూర్తాలు ఫిక్సయ్యాయి. తాళికట్టు శుభవేళకు టైమ్ దగ్గరపడిందని చెప్పుకుంటున్నారు. లగ్గమెట్టరా మామా.. డూడూ భాజా వాయిస్తా! అంటూ మేళతాళాలకు ఆర్కెస్ట్రా వోళ్లు రెడీ అవుతున్నారు. దీపిక- రణవీర్ పెళ్లి నవంబర్ 20న ఇటలీ-లోకోమోలో అంటూ పుకార్ షికార్ చేస్తోంది. ఇంచుమించు అదే సమయంలో పీసీ-నిక్ పెళ్లి ఉంటుందని చెబుతున్నారు. పీసీ పెళ్లి ఇండో-వెస్ట్రన్ స్టైల్లో ఉంటుందిట. ఈ వివరాలన్నీ ఓ స్పాట్ బోయ్ అందించారంటూ బాలీవుడ్ మీడియాలో ఒకటే హంగామా సాగుతోంది. అంటే నవంబర్ ఖరీదైన పెళ్లిళ్లకు వేదిక కాబోతోందన్నమాట!
Please Read Disclaimer