మోదీకి తొడలు చూపిస్తూ కూర్చొంటావా? ప్రియాంకపై ఆగ్రహం

0priyanka-chopra-met-pm-narendra-modiజర్మనీ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీని బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా కలుసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులతో బిజీ బిజీగా ఉన్న ప్రధాని మోదీతో ప్రియాంక అపాయింట్ మెంట్ లభించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని బెర్లిన్‌లో కలిశానని ప్రియాంక సోషల్ మీడియాలో ఓ ఫోటోతోపాటు ఓ పోస్ట్ పెట్టింది. అంతవరకు బాగానే ఉంది. ప్రధాని మోదీ ముందు కాళుపై కాలు వేసుకొని కూర్చొని ఉన్న ప్రియాంక తీరుపై భారీ స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా ప్రధాని తీరును కూడా తప్పుపడుతున్నారు.

ప్రధాని మోదీని కలిసిన సమయంలో ప్రియాంక చోప్రా ధరించిన దుస్తులపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానితో భేటీ అయ్యేటప్పుడు సభ్యత, సంస్కారాలు మరుస్తావా అంటూ ప్రియాంక ప్రవర్తనను దుయ్యబట్టారు. ప్రధాని మోదీని అగౌరపరిచే విధంగా ప్రవర్తించావంటూ సోషల్ మీడియాలో మాటల దాడికి దిగారు.

ప్రధాని ముందు కూర్చొని ఉన్నప్పుడు తొడలు కనిపించే విధంగా కాళు మీద కాలు వేసుకొని కూర్చుంటావా అని ప్రియాంకను కొందరు నెటిజన్లు నిలదీస్తున్నారు. నీవు కలిసింది దేశ ప్రధానిని అనే విషయాన్ని మరిచావు. కనీసం నీ కాళ్లను కప్పుకొనే విధంగా జాగ్రత్తలు తీసుకొనే విధంగా ప్రవర్తించాల్సి ఉండేది అని ఆమె తీరును తప్పుపట్టారు.

చెన్నై రైతులను కలువడానికి తీరికలేని ప్రధాని మోదీకి సినీ తారలను కలువడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం విదేశాల్లో వెచ్చించాల్సిన సమయాన్ని సినీ తారల కోసం కేటాయిస్తారా అని మరో నెటిజన్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.

బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి భారత ప్రధాని మోదీ సెలబ్రీటిని కలువడం సమంజసం కాదు. మా నేతలు డెవలప్‌మెంట్ ఎజెండా కోసం పాటుపడటంపై ఆఫ్రికా దేశ పౌరుడిగా నేను గర్వపడుతాను అని కెన్యాకు చెందిన ఓ వ్యక్తి ఓ పోస్ట్ పెట్టారు.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ బేవాచ్‌లో హాట్ హాట్‌గా నటిస్తూ సంచలనం రేపుతున్నది. ప్రస్తుతం జర్మనీలో విహారయాత్ర చేస్తున్నది. ఈ సందర్భంగా బెర్లిన్ చేరుకొన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యింది. దేశ ప్రధానిని కలుస్తున్నాననే స్పృహలేకుండా అసభ్యకరమైన దుస్తులు ధరించి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.