తన జీవితం మీద పుస్తకం రాసుకుంటోంది

0బాలీవుడ్ లో గత కొంత కాలంగా ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం తన స్టార్ హోదాను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది. కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నటీమణుల్లో ప్రియాంక కూడా ఉన్నారు. చాలా కష్టపడి పైకొచ్చిన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇకపోతే ప్రియాంక జీవితంలో ఎన్నో మధురమైన అనుభవాలు చేదు అనుభవాలు జీవితానికి సరిపడా జ్ఞాపకాలు చాలా ఉన్నాయట. అది ప్రతి మనిషి అర్ధం చేసుకోవాలని అమ్మడు ఒక బుక్ రాయడానికి సిద్ధమైంది. తన లైఫ్ గురించి తనే ఒక ఆత్మకథ రాసుకుంటుందట ఈ బ్యూటీ. సాధారణంగా ఎవ్వరైనా సరే జీవితంలో ఒక ఎండింగ్ స్టేజ్ లో బుక్ రాయాలని అనుకుంటారు. కానీ ప్రియాంక మాత్రం కొన్ని రోజుల్లోనే జీవితానికి సరిపడా అనుభవాలను చూశానని చెబుతోంది. అందుకే ఆమె బుక్ రి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అందులో గెలుపోటములతో పాటు బాధ ఆనందం భావోద్వేగం తెగింపు ఇలా అన్ని రకాల అనుభూతులు ఉంటాయట.

ప్రస్తుతం ప్రియాంకా ఎక్కువగా హాలీవుడ్ లోనే కనిపిస్తోంది. బేవాచ్ తరువాత హాలీవుడ్ లో ఎలాంటి అవకాశం వచ్చినా విడువడం లేదు. ఇక క్వాంటికో సిరీస్ అయితే అమ్మడి లక్కునే మార్చేసింది. ఆ తరువాత బాలీవుడ్ కథలపై అంతగా ఇంట్రెస్ట్ చుపడం లేదు. ఇటీవల సల్మాన్ తో నటించడానికి ఒక్క సినిమాను మాత్రమే ఒకే చేసింది. భరత్ అనే ఆ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.