ఎయిర్ పోర్ట్ లో రింగు తీసేసిన ప్రియాంక

0ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ల లవ్ స్టొరీ – వాళ్ళ నిశ్చితార్థం – ఆ తర్వాత పెళ్లి. దీని తర్వాతే ఏదైనా.. ఏంటిది జోకా అనుకుంటున్నారా? కాదు. ఇది ముఖ్యమైనది కాకపొతే మీరు చదవరు కదా. కాబట్టే ఈ విషయానికి ప్రపంచ మీడియా అంతా ఫుల్లు కవరేజి ఇస్తోంది. అది సరే.. విషయానికి వస్తే ప్రియాంక నిక్కు ప్రేమలో పడి పీకల్లోతున కూరుకపోయిందని ఇప్పటికే మనకందరికీ తెలుసు. ఈమధ్య నిక్కు సింగపూర్ లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ ఇస్తే అక్కడికి వెళ్లి ఫుల్ గా బాయ్ ఫ్రెండ్ ని బాగా ఎంకరేజ్ చేసింది.

ఆ తర్వాత న్యూఢిల్లీ లో పీసీ ఒక ఈవెంట్ కు హాజరు కావలిసి ఉండడంతో ఆమె ఇండియా కు తిరిగొచ్చింది. ఒక వైపు ఫాన్స్ ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తే రిపోర్టర్లు ఆమె ను ఫోటోలు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఇంతమంది ఉండగా పీసీ చేసిన ఓ చిలిపి పని వీడియో కెమెరాల కళ్ళకు చిక్కింది. అదేంటంటే.. ప్రియాంక ఉంగరం వేలికి నిక్కు తొడిగిన నిశ్చితార్థం ఉంగరాన్ని ఒడుపుగా తీసి తన పాకెట్లో ఏసుకుని ‘ఏమీ ఎరగనట్టుగా’ కటింగ్ ఇచ్చింది. పీసీ తెలివైందే కానీ ఆమెను కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా తెలివితేటలు ఉంటాయి కదా. వాళ్ళు చక్కగా వీడియో తీసి దాన్ని బయటపెట్టారు.. ఇంకేముంది? అసలే ఇంపార్టెంట్ విషయం. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఎంగేజ్మెంట్ అయితే అయిందని చెప్పకుండా ఈ రింగులు పెట్టుకోవడాలు – తీసి దాచిపెట్టుకోడాలు – మళ్ళీ ఫింగర్ కి తగిలించడాలు ఏంటిది పీసీ? అభిమానులకు నెటిజనులకు ఎంత కన్ఫ్యూజన్? పాపం వాళ్ళకు ఇవన్నీ అలోచించి నిద్రలేక బీపీ లు షుగర్లు తెచ్చుకుంటే అమెరికా నిక్కు వచ్చి ఇక్కడ ఇండియాలో హాస్పిటల్ బిల్లు కడతాడా?