బాలీవుడ్ లాంటి రొమాన్స్ కాదమ్మో..

0ప్రియాంకా చోప్రా ఇప్పుడు వరుస షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా తిరుగుతోంది. న్యూయార్క్ సిటీ పరిసరాలలో తన కొత్త సినిమా.. రొమాంటిక్ డ్రామా “ఈజింట్ ఇట్ రొమాంటిక్?” సినిమా షూటింగులో బిజీగా ఉంది. ‘బేవాచ్’ సినిమా తరువాత రెండు సినిమాలు వెంట వెంటనే మొదలుపెటేసింది. సోషల్ మీడియాలో ఆమె పై అనవసరమైన చర్చలు జరుగుతున్నా వాటిని పట్టించుకునే తీరిక ఇప్పుడు ఈ సూపర్ హీరోయిన్కు లేదనే చెప్పాలి.

ఇకపోతే పూర్తి యాక్షన్ కామిడీ సినిమా తరువాత ప్రియాంకా ఇప్పుడు తనలో ఉన్న మరో కోణాన్ని బయట పెట్టింది ఈ కొత్త సినిమాతో. అమ్మడు ఈ సినిమాలో ఒక యోగా అంబాసిడర్ గా కనిపించబోతుంది. ఈ సినిమాలో కొంచం రొమాన్స్ కొంచెం కామిడీ ఉంటుంది అని తెలుస్తుంది. ఆన్ లొకేషన్లో తీసిన ఫోటోల్లో ప్రియాంకాను చూస్తుంటే మనకు ఆ రొమాన్స్ ఎలా ఉండబోతుందో తెలుస్తుందిగా. పింక్ డ్రెస్ లో హంగామా లేకుండానే అందరి గుండెలులో తన అందంతో గుబులు పుట్టించేస్తోంది. మరింత సెక్సీ గా కనిపిస్తోందంతే. కాకపోతే ఇక్కడ రొమాన్స్ మన బాలీవుడ్ రొమాన్స్ కు భిన్నంగా ఉంటుందనే చెప్కనే చెప్పొచ్చు.

ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో హాలీవుడ్ సినిమా ‘ఏ కిడ్ లైక్ జాక్’లో నటిస్తోంది ప్రియాంక. అమెరికా టివి సిరీస్ తరువాత బాగా పాపులర్ అయిన ప్రియాంక తన హాలీవుడ్ కెరియర్ని తెలివిగా మలుచుకుంటుంది. కామెడీ డ్రామా రొమాన్స్ ఇలా అన్నీ రకాల సినిమాలలో నటిస్తూ అక్కడ తన స్థానాన్ని పదిలిపరుచుకునే పనిలో పడింది. దీనితో పాటుగా సంజయ్ లీలా భాన్శాలి సినిమా కూడా ఉండబోతుందని టాక్. ఈ రెండు సినిమాలు కూడా 2019లో విడుదల కావచ్చు.Priyanka-Chopra-Romantic-Scenes-in-A-Kid-Like-Jack