కొత్తగా పెళ్ళైన ఘాటు సుందరి!

0

గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ లు ఏడాది పాటు ప్రేమికులుగా గడిపిన అనంతరం ఈమధ్యే పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వీరి వివాహం భారీ స్థాయిలో జరిగింది. ఇదిలా ఉంటే మిస్ జోనాస్ గా మారిన ప్రియాంక తాజాగా ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది.

వోగ్ మ్యాగజైన్ జనవరి 2019 కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. ఈ జనవరి మ్యాగజైన్ లో ప్రియాంక లవ్ స్టొరీ.. తన కలల్లోని యువరాజును పెళ్ళి చేసుకోవడంపై కథనం కూడా ఉంది. ఇక ఫోటో విషయానికి వస్తే క్రీమ్ కలర్ డిజైనర్ వేర్ లో క్లీవేజ్ షో చేస్తూ సూపర్ హాట్ గా కనిపించింది. పెళ్ళయితే హాట్ గా కనిపించకూడదని చాలామంది అంటుంటారు గానీ ప్రియాంక మాత్రం మ్యారేజ్ చేసుకొని జస్ట్ నాలుగు రోజులు కూడా కాకుండానే యమా హాట్ గా పోజిచ్చింది.

ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన 17 గంటల్లోనే ఈ ఫోటోకు 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయంటేనే నెటిజనులు ఆ ఫోటోను ను చూసి ఎంతగా ఇంప్రెస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. నిక్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక పాపులారిటీ మరింతగా పెరిగినట్టుంది కదా?
Please Read Disclaimer