అరెరే పీసీ .. ఎంత పని జరిగింది?

0గత కొంతకాలంగా విదేశీ నిక్ జోనాస్ తో పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా డేటింగ్ వ్యవహారం వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. నేరుగా ఇండియాలో దిగిపోయిన నిక్.. నిను వీడని నీడను నేను అన్న తీరుగా పీసీనే అంటిపెట్టుకుని కనిపిస్తున్నాడు. చిటపటచినుకుల వేళ.. చెలికాడే సరసన ఉంటే!! అన్న తీరుగా పీసీ సైతం అతడితో రోమాంచితమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇది ఆఫ్ లైన్ మ్యారేజ్ వ్యవహారం లాంటిదేనని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం చేస్తున్నది సహజీవనం అనడంలో సందేహం లేదు. అయితే ఇండియా సెంటిమెంటు ప్రకారం పెళ్లి కార్డ్ పడాలి కాబట్టి ఆ తంతేదో ముగించేసేందుకు పీసీ పేరెంట్స్ రెడీ అవుతున్నారు. ఇక సాధ్యమైనంత తొందర్లోనే పెళ్లి బాజా మోగేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయనేందుకు తాజాగా అదిరిపోయే ఆధారం ఒకటి దొరికింది.

అప్పటికప్పుడు సల్మాన్ భాయ్ క్రేజీ ప్రాజెక్టు `భరత్` నుంచి పీసీ తప్పుకోవడానికి కారణమేంటి? అని ఎంత బుర్రలు బాదుకున్నాఅభిమానులకు అప్పట్లో అర్థం కాలేదు. అయితే అందుకు కారణాన్ని `భరత్` దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో రివీల్ చేసేయడంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇలా భరత్ చిత్రంలో పీసీ నటిస్తోంది అన్న వార్త వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ ప్రాజెక్టులో తాను నటించబోనని నిక్ జోనాస్ ని పెళ్లాడేస్తానని పీసీ సదరు దర్శకుడికి విన్నవించిందిట. ఇదే విషయాన్ని అలీ అబ్బాస్ జాఫర్ స్వయంగా వెల్లడించి పీసీ పెళ్లితో లైఫ్ లో సెటిలవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. మొన్ననే అంటే జూలై 22న భరత్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో దిశా పటానీ సల్మాన్ భాయ్ కి సిస్టర్ గా నటిస్తోంది. పీసీ స్థానంలో కరీనా(కన్ఫామ్ చేయాలి) పేరు ప్రస్తుతానికి వినిపిస్తోంది. ఇకపోతే నిక్ జోనాస్ తో పెళ్లి ఖాయమవుతుందనే క్రేజీ ప్రాజెక్ట్ `భరత్` నుంచి తొలగించారన్న సంగతిపై క్లారిటీ వచ్చేసినట్టే. భరత్ చిత్రం 2019 ఈద్ కానుకగా రిలీజ్ కానుంది. టీసిరీస్ తో కలిసి అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.