ప్రియాంక జవాల్కర్ సో సెక్సీ

0

విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా ‘టాక్సీవాలా’ విజయంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ప్రియాంక జవాల్కర్ కు ఫుల్ గా ఆఫర్లు వస్తాయని అనుకున్నారుగానీ పరిస్థితి మాత్రం అనుకున్నంత సులువుగా ఏమీ లేదు.. కాస్త కష్టంగానే ఉంది. మాస్ రాజా ‘డిస్కో రాజా’ లో హీరోయిన్ గా అమ్మడి పేరును పరిశీలిస్తున్నారని అన్నారు గానీ ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. అలా అని ప్రియాంక ఏమీ నిరాశపడకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. దాని సంగతి అలా ఉంచితే.. ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.

ఎంత యాక్టివ్ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో గ్లామరస్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ మార్చిలో మొదలు కావాల్సిన సమ్మర్ ను ఫిబ్రవరిలోనే బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఆమెకేం.. కూల్ గా పోజిలిస్తుఉంది.. హీటు పెరిగేది నెటిజనులకు.. టెంపరేచర్ పెరిగేది సోషల్ మీడియాలోనే కదా. తాజాగా ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోలో స్పెషల్ ఏంటంటే.. ఏం లేదు. డిజైనర్ వేర్ లేదు.. పెద్దగా మేకప్ కూడా లేదు.. జస్ట్ లెమన్ ఎల్లో కలర్ చుడిదార్లో అలా కూర్చుంది. బుగ్గమీద అలా చెయ్యిపెట్టుకొని చిలిపిగా నవ్వింది. అయినా అంతంతమాత్రం అందాలకు డిజైనర్ వేర్లు.. మేకప్పులు కావాలి గానీ.. ప్రియాంక లాంటి న్యాచురల్ బ్యూటీలకు అలాంటి హంగామాలు ఎందుకు? మగవాళ్ళు వేసుకుంటే ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అంటారు గానీ ఈ అనంతపూర్ భామను మాత్రం ఎల్లో ఎల్లో సెక్సీ ఫెల్లో అనేలా ఉంది సదరు ఎల్లో.

సాధారణమైన డ్రెస్ లో అలా లైట్ గా క్లీవేజ్ షో చేస్తూ చిలిపిగా నవ్వితేనే.. దేవరకొండ లాగా అందరూ మాటే వినదుగా వినదుగా.. అంటూ పాడుకుంటూ ఉండాల్సిందే. ఇక నిజంగా హాట్ గా కనిపిస్తే ఏమైపోతారో.. ఈ ఫోటోకు నెటిజనులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారండోయ్.. ఒకరు పాపను సన్ ఫ్లవర్ అంటే.. మరొకరు ‘వేగం వేగం…’ అంటూ ఆయాసపడుతూ పాట లిరిక్స్ మొత్తం ఇంగ్లీష్ లో రాసిపారేశాడు. మరి ఆ ఆయాసం ఎప్పటికే తగ్గుతుందో..!
Please Read Disclaimer