ప్రియుడి పై మోజుతో భర్తని ఏంచేసిందో తెలుసా..?

0గతం లో భర్తల వేదింపులు తట్టుకోలేక భార్యలు ఆత్మహత్యలు చేసుకున్నారు అని విన్నాం..చూసాం. కానీ ఇటీవల కాలంలో భార్యలు చేసే పడు పనులకు భర్తలు ఆత్మ హత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెళ్లి చేసుకున్నాక భర్త ,పిల్లలతో హ్యాపీ గా గడపాల్సిన భార్యలు , వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ భర్తలను చంపుతున్నారు. ఇలాంటి నేరాలు ఇటీవల కాలం లో ఎక్కువయ్యాయి. తాజాగా మరో వివాహేతర సంబంధం యువకుడి మరణానికి దరి తీసింది.

దండేపల్లి మండలం ధర్మారావు పేట కు చెందిన ధర్మరాజు (27) అనే యువకుడితో జగిత్యాల మండలం కానాపూర్ గ్రామానికి చెందిన నాగ లక్ష్మి తో గత ఏడాది మార్చిలో వివాహం జరిగింది. అయితే కొంతకాలం గా నాగ లక్ష్మి, జగిత్యాల జిల్లా వెల్గటూర్ కు చెందిన మహేష్ తో వివాహేతర సంబంధం సాగిస్తుంది. ఈ క్రమం లో నాగ లక్ష్మి తో ఉన్న అసభ్యకరమైన వీడియోలను మహేష్ , ధర్మరాజు కు పంపిస్తూ మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. ఆ వీడియో లో ధర్మ రాజు కట్టిన తాళిని తీసేసి మహేష్ చేత తాళి కట్టించుకుంది నాగలక్ష్మి. ఆ వీడియోలు చూసిన ధర్మరాజు మానసికంగా కుమిలిపోయి , పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలిసినవారంతా నాగ లక్ష్మి ని తిట్టడం మొదలు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నాగ లక్ష్మి తో పాటు మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు.