‘లెజెండ్‌’ నిర్మాతలకు లాభాలే లాభాలు!

0balakrishna-legendనందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘లెజెండ్‌’. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. దాదాపు 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంకు విడుదలకు ముందే 50 కోట్లు బిజినెస్‌ చేసిందట. అన్ని ఏరియాల పంపిణి హక్కులు, అన్ని రైట్స్‌ కలిపి 50 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం విడుదల తర్వాత నిర్మాతలకు మరిన్ని లాభాలను తెచ్చిపెట్టబోతుంది అని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

‘సింహా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ట్రైలర్‌ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. దాంతో అన్ని ఏరియాలకు కూడా భారీ డిమాండ్‌ ఏర్పడిరది. నిర్మాతలు కూడా ఇదే అదునుగా భారీగా రైట్స్‌ రూపంలో దండుకున్నారు. నైజాం ఏరియాలోనే 8 కోట్ల పంపిణి రైట్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.