వ్యభిచారినా..నాకెవరూ డబ్బివ్వలేదు:శ్రీరెడ్డి

0చెన్నైలో మకాం వేసిన నటి శ్రీరెడ్డి….కోలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చేస్తోన్న అర్ధ రహిత ఆరోపణలపై నడిగర్ సంఘంతో పాటు పలువురు మండిపడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి వ్యభిచారం చేసిందంటూ నటుడు వారాహి….పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లోని ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు – బెదిరింపులతో డబ్బు వసూలు చేసిన శ్రీరెడ్డి….ఇపుడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అరెస్టయిందంటూ కొన్ని యూట్యూబ్ చానెళ్లలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై మండిపడ్డ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.

తాను అరెస్టు కాలేదని అవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేసింది. డబ్బుకోసం తనపేరును వాడుకుంటున్న కొన్ని యూట్యూబ్ చానెళ్లు వ్యభిచారం చేస్తున్నాయని అలాంటి చీడ పురుగుల కన్నా వ్యభిచారం చేసే అమ్మాయిలు ఎంతో మేలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తానేమీ వ్యభిచారిని కాదని….తానెవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని ఆ మాటకొస్తే తనతో పడుకున్న తర్వాత….ఎవరూ కనీసం అన్నం కూడా పెట్టలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. సెక్స్ అంటే ఆడ – మగ కలిసి చేస్తారని….ముందుగా తనతో పడుకున్న మగవారిపై కూడా వ్యభిచార కేసులు పెడితే బాగుంటుందని చెప్పింది. అలా అయితే `మీ టూ` బాధితులంతా వ్యభిచారులేనని….ఆ రకంగా చూసుకుంటే మహిళలకు ఏమాత్రం రక్షణ లేని దేశంగా భారత్ పేరు ప్రపంచపటంలో మిగిలిపోతుందని తెలిపింది.