వ్యభిచార కూపం నుంచి తెలుగు నటికి విముక్తి

0Sex-racetసినిమాల్లో, సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఓ తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్టుని బెంగుళూరు పిలిపించుకున్న తెలిసిన వ్యక్తే ఆమెని వ్యభిచార కూపానికి పంపించాడు. శుక్రవారం హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన నటిని బెంగుళూరు ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్న మార్క్ అనే ఆ వ్యక్తిని ఆమెని కోరమంగళంలోని ఓ గెస్ట్ హౌజ్‌కి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సాయంత్రం వేళ మరాఠహళ్లి అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అతడిని నమ్మి బెంగుళూరు వెళ్లిన ఆమె అతడి ఆదేశాల ప్రకారమె మరాఠాహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌కి వెళ్లింది. అయితే, పలానా అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అదే సమయంలో రైడ్ చేయడంతో అప్పటివరకు అక్కడ గుట్టుగా సాగిన వ్యభిచారం దందా బట్టబయలైంది. వ్యభిచార ముఠా బారి నుంచి బాధితురాలిని కాపాడిన బెంగుళూరు పోలీసులు.. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్‌ని అరెస్ట్ చేశారు.

గత మూడేళ్లుగా నటిగా కెరీర్ నెట్టుకొస్తున్న తనకి సొంత భాషలో అవకాశాలు రావడం లేదని బాధపడుతున్న సమయంలో తెలిసిన వ్యక్తే తనకి కన్నడ సినిమాలు, సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి బెంగుళూరు రప్పించినట్టు బాధితురాలు పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

అపార్ట్‌మెంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎన్‌.వీ. స్వరూప్(23), రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న అమీరుల్లా ఇస్లాం(22) లని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన మేనేజర్ స్వరూప్ స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా. ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన స్వరూప్ గత రెండేళ్లుగా ఇదే అపార్ట్‌మెంట్‌లో వుంటూ అక్కడ మేనేజర్‌గా డ్యూటీ చేస్తున్నాడు. ఆ ఉద్యోగంతో తనకి వచ్చే రూ.15,000 జీతం ఇంటి ఖర్చులకి సరిపోకపోవడంతో అపార్ట్‌మెంట్‌లో గదులని ఇలా కస్టమర్స్‌కి అద్దెకి ఇస్తూ అడ్డదారిన సంపాదించడం మొదలుపెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.