బాహుబలి2 గురించి సీక్రెట్ చెప్పిన పృథ్వీ

0prudhvi-comedianబాహుబలి ప్రాజెక్టులో ఒక చిన్న సీన్ లో అయినా తమను చూపించమని.. దర్శకుడు రాజమౌళిని అడగని ఇండియన్ హీరోలు ఎవరూ ఉండరేమో. అంతగా బాహుబలి చిత్రానికి పేరు ప్రఖ్యాతులు దక్కాయి. ఈ మూవీలో ఛాన్స్ రావడం అంటే.. లైఫ్ టైం అఛీవ్మెంట్ దక్కినట్లే అనే ఫీలింగ్ చాలామందికి వచ్చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా బాహుబలి ది కంక్లూజన్ గురించి ఓ సీక్రెట్ చెప్పేశాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ఈ మూవీలో తాను నటిస్తున్నానని.. తనకు ఓ మంచి పాత్ర రాజమౌళి ఇచ్చారని చెప్పి.. సంచలనమే సృష్టించాడీ బాయిలింగ్ స్టార్. సాధారణంగా బాహుబలిలో నటిస్తున్న యాక్టర్స్ ఎవరూ.. ఆ పాత్రలకు సంబంధించిన గుట్టు విప్పినది లేదు. కానీ పృథ్వీ మాత్రం.. ‘బాహుబలి2 లో తాను అనుష్క చేసిన రాణి దేవసేన పాత్రకు మంత్రిగా కనిపిస్తాను.. ఇప్పటివరకూ కామెడీ కేరక్టర్స్ చేసినా.. బాహుబలి2లో మాత్రం సీరియస్ రోల్ చేస్తున్నా’ అని చెప్పాడు పృథ్వీ.

తాజాగా ఖైదీ నంబర్ 150లో తన రోల్ ను తీసేశారని.. పండుగ రోజున అమ్మ చనిపోయినంత బాధ వేసిందని.. గోలగోల చేసి వార్తల్లో నిలిచిన పృథ్వీ.. ఇప్పుడు బాహుబలి2 లో రోల్ దక్కడంతో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోతున్నాడు.