పవన్ పై కామెంట్ విసిరిన పూరి

0pawan-comment-puriక్రియేటివ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ప్రేక్షకులకు తన సినిమా ద్వారా ‘హార్ట్ ఎటాక్ తెప్పిద్దామని చేసిన ప్రయోగానికి రాష్ట్ర వ్యాప్తంగా డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ డివైడ్ టాక్ ను దర్శకుడు పూరి పవన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘అత్తారిల్లు’ సినిమా తో పోల్చుకుంటూ ఒక విచిత్ర కామెంట్ చేసాడు. తన సినిమాకే కాకుండా సూపర్ హిట్ అయిన ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ ఉంటుంది అంటూ ప్పవన్ బ్లాక్ బ్లస్టర్ హిట్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు కూడా డివైడ్ టాక్ వచ్చి తరువాత సూపర్ హిట్ గా మారిందని ఒక విచిత్రమైన చేసాడు.   అంతేకాదు ‘హార్ట్ ఎటాక్’కు మంచి రిపోర్టులు వస్తున్నాయని తామంతా హ్యాపీ అంటూ చెప్పుకొస్తున్నాడు పూరి జగన్నాథ్ పూరి తాజా చిత్రం ‘హార్ట్ ఎటాక్’ మొన్న శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఇలా స్పందించారు తన సినిమా ను కొందరు బాగుంది అంటే మరికొందరు బాగాలేదు అని అంటున్నారని అంటు పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఇంత బాగా ఆడినా మంచి వసూళ్లు సాధించినా ఇప్పటికీ కొందరు సినిమాలో ఏముందిలే అని పెదవి విరుస్తున్నారని అంటు అదేవిధంగా తన ‘హార్ట్ ఎటాక్’ సినిమా పై కూడా డివైడ్ టాక్ రావడంలో తప్పు ఏముంది అంటు తన సినిమాను విచిత్రంగా ప్రోమోట్ చేసుకుంటున్నాడు పూరి. ఎదిఎమైనా పూరి పవన్ సినిమాతో పోల్చుకుంటూ లేపుతున్న వితండ వాదం ఫిలింనగర్ లో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటే మరి కొంత మందికి పూరి మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. పూరి మాటల పై మీ కామెంట్స్ కూడా ఎపిహెరాల్డ్ కు తెలియచేయండి.