బాలకృష్ణతో పూరీ ఆటో జానీ?

0Puri-Jagannath-auto-jani-Movie-With-balayyaనందమూరి బాలకృష్ణతో పూరీ జగన్నాధ్ మూవీ చేయనున్నాడనే విషయం పాత సంగతే. ఇవాళ ఉదయమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ చిత్రంపై వినిపిస్తున్న కొత్త సంగతులు ఆసక్తి కలిగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం పూరీ జగన్నాధ్ కు మొదట అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆటో జానీ స్క్రిప్ట్ ను పూరీ ప్రిపేర్ చేసినా.. సెకండాఫ్ విషయంలో తేడాలు రావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. అదే స్క్రిప్ట్ ను బాలయ్యకి తగినట్లుగా మార్చాడట పూరీ. ఆయన స్టైల్ కు.. బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా కొన్ని సీన్లను రీరైట్ చేసి వినిపించాడట. ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమా ఆటో జానీయే అంటున్నారు సన్నిహితులు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో.. బాలయ్యను కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు రెడీ అయ్యాడట పూరీ జగన్నాధ్.

అయితే.. టైటిల్ మాత్రం ఆటో జానీ ఉండదని.. వేరే క్యాచీ టైటిల్ విషయంలో ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇంకా ఈ చిత్రానికి హీరోయిన్స్ ను అనౌన్స్ చేయలేదు కానీ.. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.