పూరి కాన్ఫిడెన్స్ చూసి అందరూ షాకే

0


puri-jagannath-directorఅసలు ఆ విధంగా విచారణకు రమ్మని చెబితే ఇంకో గుండె అయితే షాకైపోతుంది. కాని దర్శకుడు పూరి జగన్ మాత్రం.. సె్పషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రమ్మని చెప్పగానే వెంటనే వెళ్లడమే కాదు.. డ్రగ్స్ కేసు గురించి ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చివరకు అంత చేసినా కూడా తన ప్రాణానికి ప్రాణమైన సినిమాను మాత్రం వదల్లేదు. వెంటనే చక్కగా ”పైసా వసూల్” సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు.

విషయం ఏంటంటే.. పూరి డైరక్షన్లో వస్తున్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమాకు మొన్నటి వరకు మాంచి డిమాండ్ లేదు కాని.. ఎప్పుడైతే మనోళ్లు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో వెంటనే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి ఏర్పడిందట. అందుకే చాలామంది పంపిణీదారులు ఈ సినిమాకు మాంచి ఆఫర్లే అందించారట. అయితే పూరి మాత్రం.. అప్పుడే సినిమా అమ్మొద్దు అంటూ తన నిర్మాతలకు చెప్పడంతో వారు షాకయ్యారు. కాని రేపు 28వ తారీఖున రిలీజ్ చేయబోయే టీజర్ ట్రైలర్ ఫైనల్ కట్ ను వారికి చూపించడంతో మనోళ్ళు అసలు పూరి కాన్ఫిడేన్స్ ఏంటి బాబోయ్ అని షాక్ తినేశారట. రెండు నిమిషాల టీజర్ ఆద్యంతం పవర్ ఫుల్ యాక్షన్ తో బాలయ్య మాటల తూటాలతో నిండిపోవడంతో.. ఇది రిలీజ్ చేస్తే సినిమా బిజినెస్ ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నారట.

ఈ మధ్య కాలంలో పూరి జగన్ సినిమాల ట్రైలర్లన్నీ రొటీన్ గానే ఉన్నాయి. టెంపర్ తరువాత మనోడు చేసిన లోఫర్.. జ్యోతిలక్ష్మి.. ఇజం వంటి సినిమాల ట్రైలర్లు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. మరి ఇప్పుడు బాలయ్య ‘పైసా వసూల్’ ట్రైలర్ పూరి అంత కొత్తగా రూపొందించాడు అని చెబుతుంటే.. ఫ్యాన్స్ కూడా దీనికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతోందో!!