పూరికి ఛాన్స్ ఇవ్వని సీనియర్ హీరోస్!

0puri-jagannath-directorమాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇప్పుడు పూర్తిగా డైలమాలో పడిపోయాడు. పెద్ద హీరోలు ఎవరూ పూరీకి ఛాన్స్ ఇచ్చేందుకు రిస్క్ చేసే పరిస్థితి కనిపిచడం లేదు. ప్రాజెక్టులు అందినట్లే అంది.. చేజారి పోతున్నాయి.

మొదటగా మెగాస్టార్ చిరంజీవితో ‘ఆటో జానీ’ దగ్గర నుంచి పూరీ పరిస్థితి మారిపోయింది. ఈ మూవీ సెకండాఫ్ విషయంలో మెగాక్యాంప్ సంతృప్తి చెందకపోవడం.. పక్కనపెట్టేయడం.. తర్వాత మాటామాటా పెరగడంతో పూరీకి బ్యాడ్ టైం మొదలైంది. అంతకు ముందే జ్యోతిలక్ష్మి.. లోఫర్ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితే.. కళ్యాణ్ రామ్ తో ‘ఇజం’ మూవీ చేశాడు పూరీ. ఇది కూడా బోల్తా కొట్టేసింది. దీంతో పూరీకి ప్రాజెక్ట్ ఇవ్వడం అంటే రిస్క్ అనుకునే పరిస్థితి.. హీరోలకు వచ్చేసిందట.

మహేష్ బాబుకి ‘జన గణ మన’ స్టోరీ చెప్పానని.. ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని పూరీనే స్వయంగా చెప్పాడు. అదే ప్రాజెక్ట్ వెంకీతో చేద్దామని ఫిక్స్ అయితే.. ఇక అనౌన్స్ మెంట్ మాత్రమే లేట్ అనుకుంటున్న టైంలో.. క్రిష్ తో వెంకీ సినిమా ఖాయం చేసుకున్నాడనే విషయం ఫైనల్ అయిపోయింది. దీంతో ఇప్పుడు పూరీ జగన్నాధ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయేందుకు పూరీ ఏం చేయనున్నాడనే ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.