పూరీని గట్టెక్కించే బంగారుకొండ

0

ఓడలు బళ్లవ్వడం..బళ్లు ఓడలు కావడం అన్నది జగమెరిగినదే. కాలం కలిసి రాకపోతే తాడే పాము అయ్యి కరుస్తుందంటారు. ఇవన్నీ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కి అనుభవాలు. ఒకప్పుడు క్షణం తీరికలేకుండా క్రేజీ ప్రాజెక్ట్ లతో .. ఇండస్ట్రీ హిట్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పూరి ఇప్పడు చేతిలో సినిమా లేక `కేవ్`కే పరిమితమయ్యాడు. గత కొంత కాలంగా పూరీకి హిట్టు కష్టమైంది. `లోఫర్` నుంచి వరుసగా చేసిన సినిమాలన్నీ దారుణంగా దెబ్బెయ్యడంతో పూరి కెరీర్ ప్రశ్నార్థంకమైంది.

కనీసం ట్రబుల్ షూటర్ రవితేజతో మళ్లీ కెరీర్ని పరుగులు పెట్టించాలనుకున్నా అక్కడా సన్నివేశం తిరోగమనంలో ఉంది. స్టార్ హీరోల్లో ఎవరూ పూరీని పట్టించుకోలేని పరిస్థితి. పోనీ తన కొడుకు ఆకాష్ తో హిట్టు కొట్టి ఆ తరువాత దాన్ని చూపించి పెద్ద హీరోతో సినిమాకు వెళదామన్నా ఆ ప్రయత్నమూ బెడిసికొట్టింది. దీంతో పూరీని గట్టెక్కించే బంగారుకొండ కోసం అతని టీమ్ ఎదురుచూస్తోంది. సైలెంట్ గా వచ్చి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న తెలంగాణ హీరో విజయ్ దేవరకొండ తనని ఆదుకుంటాడా? అన్న చర్చా ప్రస్తుతం సాగుతోంది.

దేవరకొండ ఇప్పడు మంచి స్వింగు మీదున్నాడు. వరుస హిట్లతో నిర్మాతల పాలిటి బంగారుకొండ అనిపించుకుంటున్నాడు. అతన్ని ఎలాగైనా ఒప్పించి సినిమా చేయాలని పూరి భావిస్తున్నాడట. ఆ క్రమంలోనే విజయ్ తో పూరి భేటీ అయ్యారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ సీన్ వేరేగా ఉంది. ప్రస్తుతం వరుస కమిట్ మెంట్ లతో బిజీగా వున్నాడు. తన మామ భాగస్వామ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న `డియర్ కామ్రేడ్`లో నటిస్తున్న విజయ్ ఆ సినిమా తరువాత మరిన్ని కమిట్ మెంట్ లు ఇచ్చాడట. అవన్నీ ఎప్పుడు పూర్తవ్వాలి? ఎప్పుడు పూరీకి డేట్లివ్వాలి.. పూరి ఆశ నెరవేరే ఛాన్సుందా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పూరీ తలుచుకుంటే అదెంతపని?.. ఒక్కసారి పూరి ట్రాక్ లో పడితే మళ్లీ తన పాత జోరును చూపించడం ఖాయమేని అతని సన్నిహితులు చెబుతున్నారు. మరి పూరీని కనికరించి విజయ్ దేవరకొండ అతని పాలిట బంగారు కొండగా నిలుస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం తనయుడు ఆకాష్ పూరితో ఓ సినిమా – ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ సినిమాకి పూరి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే టైమ్ లో దేవరకొండను దారిలో పెట్టడం ద్వారా తన ట్రాక్ ని పునరుద్ధరించుకోవాలన్నది పూరి ఆలోచన అట. అయితే దేవరకొండ క్యూలో మారుతి – గోపిచంద్ మలినేని లాంటి డైరెక్టర్లు ఉన్నారు. వీళ్లంతా దేవరకొండ కోసం కథలు రెడీ చేసి మరీ ట్రయల్స్ లో ఉన్నారట.
Please Read Disclaimer