ఫ్లాప్ దర్శకుడితో అవసరమా పూరి?

0

దర్శకుడు పూరి జగన్నాధ్ ఎంతో మందిని స్టార్స్ గా తయారు చేశాడు. పలువురు స్టార్ హీరోలకు కెరీర్ లోనే నిలిచి పోయే సినిమాలను ఇచ్చాడు. పూరి జగన్నాధ్ వల్ల ఎంతో మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం కాదనలేని సత్యం. అలాంటి పూరి జగన్నాధ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వరుసగా ఫ్లాప్ అవుతున్న పూరి ఏదోలా రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంను చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక పూరి తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

పూర్తి స్థాయి హీరోగా ఆకాష్ ‘మెహబూబా’ చిత్రంతో పరిచయం అయ్యాడు. ఆ సినిమాకు పూరి దర్శకత్వం వహించాడు. తనయుడి కోసం చాలా విభిన్నమైన కథను తయారు చేశాడు. అయితే ఆ సినిమా కాస్త బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో తనయుడితో మరో సినిమా చేయాలనే ఆలోచనకు స్వస్థి చెప్పాడు. ప్రస్తుతం ఆకాష్ ‘రొమాంటిక్’ అనే చిత్రాన్ని పూరి శిష్యుడు అయిన అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నాడు. పూరి అందించిన కథతోనే రొమాంటిక్ చిత్రం తెరకెక్కుతుంది. ఆకాష్ రెండవ సినిమా సెట్స్ పై ఉండగానే మూడవ సినిమాకు సంబంధించిన చర్చలను మొదలు పెట్టారు.

ఆకాష్ మూడవ సినిమాను మల్లికార్జున్ దర్శకత్వంలో చేయించాలని పూరి భావిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభం అయ్యిందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ తో ఈ దర్శకుడు మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కళ్యాణ్ రామ్ తప్ప మరే హీరోను కూడా మల్లికార్జున్ తన కథతో ఒప్పించలేక పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆకాష్ పూరితో సినిమాకు ఈ దర్శకుడు సిద్దం అయ్యాడు. వరుసగా ఫ్లాప్ లు ఇచ్చిన దర్శకుడితో తన కొడుకు సినిమాకు ఏర్పాట్లు చేయడం ఏంటీ అంటూ పూరి జగన్నాధ్ పై విమర్శలు కురిపిస్తున్నారు.
Please Read Disclaimer