హాలీవుడ్లో మన స్టార్ కు ఇల్లు కావాలట

0యంగ్ ఏజ్ లో హీరోగా చేసినప్పుడు ఎంత పాపులారిటీ ఉందో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక కూడా మాధవన్ కు అంతే ఇమేజ్ ఉంది. కొన్ని పాత్రలు అతడితోనే చేయించాలని డైరెక్టర్లు పట్టుపట్టి మరీ మాధవన్ తోనే చేయిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ అండ్ బాలీవుడ్ లో సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

మాధవన్ షూటింగ్ ల నిమిత్తం అమెరికాకు వెళ్తూనే ఉంటాడు. యూఎస్ లోని లాస్ ఏంజెల్స్ సిటీ మ్యాడీకి బాగా నచ్చిందట. అందుకే ఆ సిటీలో ఓ ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు లాస్ ఏంజిల్స్ కు వచ్చినప్పుడు పలుచోట్ల తిరిగి కొన్ని ఇళ్లు చూశాడట. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఇల్లు కొనేయడానికి రెడీ అవుతున్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఇకపై షూటింగ్ లలో గ్యాప్ వచ్చినప్పుడల్లా ఇండియాకి తిరిగి వెళ్లడం.. మళ్లీ కొద్దిరోజుల్లోనే తిరిగి రావడం.. ఇవన్నీ ఇబ్బందిగా మారడంతో ఇల్లు కొనడమే బెస్టని డిసైడైపోయాడట.

మాధవన్ తాజాగా తెలుగులో సవ్యసాచి సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మాధవన్ రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అతడితో ఉండే యాక్షన్ సీన్స్ సినిమా హైలైట్ గా నిలుస్తాయి. బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ సవ్యసాచితో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.