సెన్సార్ పై పీపుల్ స్టార్ ఫైర్

0ఆర్ నారాయణమూర్తి సెన్సార్ బృందం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు ఆర్ . నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ” అన్నదాత సుఖీభవ ” . ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది , అయితే సెన్సార్ సభ్యులు మూడు సీన్లు కట్ చేయమని కోరడంతో ఆర్ . నారాయణమూర్తి రెండు సీన్ల గురించి రాజీ పడటానికి సిద్దమయ్యాడు కానీ మూడో సీన్ కు మాత్రం ఒప్పుకోలేదు కానీ సెన్సార్ వాళ్ళు మాత్రం నో చెప్పారు

దీంతో ఆయన తనశైలిలో ఫైరయ్యారు. తాను రైతుల సమస్యలే ఇతివృత్తంగా ఈ సినిమా తీశానని, సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన సీన్లను తొలగించమని సెన్సార్ వారు అంటున్నారని , తన ప్రజల ఆవేదనను తెలియజెప్పాలని చూడడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఏం పాపం చేశారు? పారిశ్రామిక వేత్తలు ఏం పుణ్యం చేశారు? కోట్లాది రూపాయలు మోసం చేసి కొందరు పారిపోతున్నారని, రైతులను ఆదుకోవాలని సీన్లు తీయడం తప్పా? అని అడిగారు.