మగధీరకు జిరాక్స్ కాపీలా ఉందే..!

0Raabta-Movie-Trailerచాలాసార్లు కొన్ని సినిమాల ట్రైలర్లు చూసేవారకు అవేం సినిమాలో చెప్పడం కష్టం అవుతుంది. కాని ఒక్కసారి ట్రైలర్ చూశాక మాత్రం.. ఎక్కడి నుండి లేపేసి తీశారా అంటూ జనాలు ఇట్టే చెప్పేస్తారు. ఇప్పుడు యావత్ సౌత్ ప్రేక్షకులు అలాంటి ఓ ట్రైలర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 1-నేనొక్కడినే ఫేం కృతి సనోన్ హీరో హీరోయిన్లు రూపొందిన ”రాబ్తా” సినిమా ఉంది చూడండి.. అబ్బో అరాచకం.

బాలీవుడ్డోళ్ళిక అబ్బో హీరో హీరోయిన్లు ఎప్పుడో గత జన్మలో ప్రేమికులు.. ఇప్పుడు పునర్జన్మలో సాధించుకున్నారు.. అంటూ గొప్పగా అనిపించవచ్చు కాని.. నిజానికి ఈ సినిమా మొత్తం ”మగధీర” సినిమాకు యాజిటీజ్ జిరాక్స్ కాపీలా ఉంది. కాకపోతే తెలుగులో రామ్ చరణ్ స్టంట్స్ చేసే కుర్రాడిగా కనిపిస్తే.. ఇక్కడ మాత్రం ఫారిన్లో పనిచేసే అబ్బాయిగా హీరోను చూపించారు. ఇక్కడ డ్యాన్సుల్లో స్టెప్పులెక్కువ.. అక్కడ సీన్లలో లిప్ కిస్సులెక్కువ. ఇక ఇంటర్వెల్లో నీళ్ళ పొర మధ్యనుండి భైరవ చీల్చుకొచ్చే సీనుంది చూశారూ.. యాజిటీజ్ దింపేశారు. అయితే మగధీర రైట్స్ కొనుక్కొని ఈ సినిమా తీశారా? లేకపోతే జస్ట్ కొట్టేసి పనికానిచ్చేశారా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

కొత్త దర్శకుడు దినేష్ విజన్ రూపొందిస్తున్న ఈ సినిమా కోపం కృతి తన అందాలను బాగానే ఆరబోసింది. అలాగే సుశాంత్-కృతి మధ్యన ఏదో కెమిస్ర్టీ నడుస్తున్నట్లు రూమర్లు ఆల్రెడీ ఉన్నాయి కాని.. ఈ ట్రైలర్ చూశాక అవి నిజమే అనిపించక మానదు.