రత్తాలు బ్లాక్ బికినీ సెగలు

0

2017లో బాలీవుడ్ లో `జూలీ2` చిత్రంలో నటించిన లక్ష్మీ రాయ్ ఆ తర్వాత తిరిగి సౌత్ లోనే వరుసగా సినిమాలతో బిజీ అయ్యింది. ఇటీవలే `వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి` అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తీవ్రంగానే నిరాశపడింది. ప్రస్తుతం తమిళంలో నీయ 2(నాగకన్య) సిండ్రెల్లా.. ఝాన్సీ అనే చిత్రాల్లో నటిస్తోంది. నీయ2 మే 10న రిలీజ్ అంటూ లేటెస్టుగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగులో ఇదే చిత్రం `నాగకన్య` పేరుతో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ క్రమంలోనే ఈ భామ తన సినిమాల్ని ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది.

నాగకన్య (నీయ 2) చిత్రంలో నాగినిగా ప్రయోగాత్మక పాత్రలో నటించిన రాయ్ లక్ష్మీ కాస్తంత డీగ్లామరస్ గానూ కనిపించబోతోందని పోస్టర్లు చెబుతున్నాయి. ఓవైపు అందాల ఎలివేషన్ తో పాటు కాస్త ప్రయోగాత్మక యాంగిల్ ని చూపించబోతోంది. ఈ మూవీపై రాయ్ లక్ష్మీ చాలానే అశలు పెట్టుకుందట. ఎలానూ రిలీజ్ కి సమయం ఆసన్నమైంది కాబట్టి అంతకంటే ముందే సమ్మర్ వెకేషన్ .. న్యూ గోల్స్ అంటూ అమ్మడు యూత్ కి సవాళ్లు విసురుతోంది.

అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో రత్తాలు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసింది. తాజాగా రాయ్ లక్ష్మీ రివీల్ చేసిన ఓ బికినీ ఫోజు కుర్రకారు కంటిపై కునుకు పట్టనీకుండా చేస్తోంది. వేడెక్కించే బ్లాక్ బికినీ ధరించిన రాయ్ లక్ష్మీ ఆ ఒంటరి దీవిలో దూరంగా ఉన్న కొండల్ని ఆ చుట్టూ ఉన్న జలాశయాన్ని వీక్షిస్తూ మైమరిచిపోతూ కనిపించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫోటో జోరుగా వైరల్ అవుతోంది. “రైజ్ & షైన్ .. బర్త్ డే గాళ్“ అంటూ ఓ కొటేషన్ ని ఇచ్చింది. ప్రస్తుతం సెలవుల్లో ఉన్నానని స్పష్టంగా చెప్పింది. మొత్తానికి సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తదుపరి సినిమా ప్రమోషన్స్ కి జాయిన్ అవుతుందేమో చూడాలి. మరోవైపు పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక టాలీవుడ్ లో అగ్ర కథానాయకులతో సత్సంబంధాలు నెరుపుతున్న ఈ అమ్మడికి వాళ్లలో ఎవరూ పిలిచి ఛాన్సివ్వకపోవడానికి కారణమేంటో రత్తాలే చెప్పాలి.
Please Read Disclaimer