పెళ్లి గురించి రాశీఖన్నా ఫీలింగ్స్

0rashi-khanna-picసన్నజజి మొగ్గలకే ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా అందరూ అనుకుంటారు. కానీ.. బొద్దు మల్లెలకు కూడా ఛాన్సులకు కొదవ ఉండదన్న విషయాన్ని చెప్పేసిన క్రెడిట్ రాశీఖన్నాకే దక్కిందని చెప్పాలి. బొద్దుతనంలో అందాన్ని తెలుగు ఇండస్ట్రీకి చూపించటంలో ఆమె సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

మిగిలిన హీరోయిన్లకు భిన్నంగా కనిపించే రాశీఖన్నా మాటలు కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఎవరిని పెళ్లి గురించి కదిపినా.. జస్ట్ థర్టీనేగా.. అప్పుడే పెళ్లికేం తొందరన్న మాటే వినిపిస్తుంది. కానీ.. రాశీ దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఊహించని సమాదానం చెప్పిషాకిస్తుంది. పెళ్లి మాటేమిటన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చిన్నతనం నుంచి తనకు పెళ్లి గురించి చాలానే కలలు ఉండేవని చెప్పి సర్ ప్రైజ్ చేసింది.

ఇలాంటి సమాధానాలుహీరోయిన్ల నోటి నుంచి సహజంగా వినిపించవు. కానీ.. నిజాయితీగా పెళ్లి గురించి తన ఫీలింగ్స్ చెప్పిన రాశీఖన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి తాను చాలానే అనుకునేదాన్ననని.. ట్వంటీటూ కంప్లీట్ అయిన వెంటనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని చెప్పింది. కానీ.. ఇప్పడు అదంతా మారిపోయిందని చెప్పింది.

పెళ్లి గురించి ఇప్పుడు తలుచుకుంటేనే నవ్వొస్తుందని.. మామూలుగా అయితే పెళ్లి అయిపోయి రెండేళ్లు దాటిపోవాలని..ఇప్పుడు పెళ్లి కాదు కెరీర్ మీదనే ఫోకస్ అంటూ తనలోని మార్పు చెప్పేసింది. ఇదంతా చెబుతూనే.. తనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ అన్న విషయాన్ని ఎంత చక్కగా అర్థమయ్యేలా చెప్పిందో కదా?