బాలీవుడ్ భామతో సింగపూర్ అంటా

0హీరోలు స్నేహితులు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో గాని హీరోయిన్స్ ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. అవసరం అయితే ప్రపంచ దేశాలను చుట్టి రావడం నటీమణులకు అలవాటే. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో హీరోయిన్స్ తో కలిసి హాలిడే స్పాట్ లకు వెళుతున్నారు. రీసెంట్ గా రాశి ఖన్నా కూడా అదే తరహాలో ప్లాన్ వేసుకుంది. మరో నటీమణితో కలిసి వెళుతుండగా కెమెరా కంట పడింది.

రాశి తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె నార్త్ హీరోయిన్స్ తోనే కొంచెం ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. వాణీ కపూర్ ని అమ్మడు తరచు కలుస్తూ ఉంటుంది. అందుకే ఈ సారి ఆమెతో కలిసి హాలిడే ఎంజాయ్ చేయడానికి డేట్ సెట్ చేసుకుంది. మొన్నటి వరకు చాలా దేశాలు తిరిగొచ్చిన రాశి ఈ సారి సింగపూర్ ని ఎంపిక చేసుకుంది. బాలీవుడ్ బేబీ వాణీ కపూర్ కి కూడా దేశాలు తిరిగి రావాలంటే చాలా ఇష్టం.

ఆమె బాలీవుడ్ భామలతో తరచు వెళుతూనే ఉంటుంది. ఇక ఈ సారి స్పెషల్ గా రాశి చెప్పగానే అమ్మడు ఒకే చేసి సింగపూర్ కి పయనమైంది. ఇక రాశి ఖన్నా చివరగా తొలిప్రేమ సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నితిన్ తో శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది.