అమలాపురంలో అందాల రాశి

0ప్రస్తుత హీరోయిన్లలో మోస్ట్ లక్కీయస్ట్ అంటే రాశీఖన్నా అనే చెప్పాలి. ఇటు గ్లామర్ రోల్స్ అయినా… అటు నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ అయినా కూడా ఆమె పేరు లెక్కలోకి తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సక్సెస్ కావడానికి రాశీఖన్నా టాలెంట్ కూడా కారణమని ఒప్పుకోక తప్పదు.

తొలి ప్రేమ హిట్ రాశీ కెరీర్ కు కూడా మంచి ప్లస్సయింది. దీని తరవాత తెలుగు – తమిళంలో ఆమె బాగా బిజీ అయిపోయింది. లేటెస్ట్ గా నితిన్ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణంలో రాశీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమలాపురంలో అవుతోంది. గోదావరి అందాలకు తోడు రాశి గ్లామర్ కలిసి చూడటమంటే ప్రేక్షకులకు కనువిందు అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు సింగపూర్ లో ప్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కోనసీమలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది.

దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న శ్రీనివాస కళ్యాణం మూవీని సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నాడు. శతమానం భవతి సక్సెస్ తరవాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఒక పెళ్లితో రెండు కుటుంబాలు ఎలా బంధాన్ని పెనవేసుకుంటాయో అందంగా చూపించే సినిమా ఇదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అమలాపురంలో షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది.