ఇక్కడే పెళ్లి చేసుకుంటా.. రాశిఖన్నా

0నితిన్ – రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత.. ‘శతమానం భవతి’ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అన్నది విడుదలైతే కానీ తెలియదు..

అయితే ఈ సినిమాలో కుటుంబం బంధాలు – పెళ్లి తంతు చూసి హీరోయిన్ రాశిఖన్నా ఫిదా అయిపోయిందట.. సినిమా తనను పూర్తిగా మార్చేసిందని ఆమె చెబుతోంది. ఈ సినిమాలోని మానవ సంబంధాల్ని దర్శకుడు సతీష్ అద్భుతంగా చూపించాడని.. చలించిపోయి ఆయన కాళ్లకు నమస్కరించానని రాశి చెప్పుకొచ్చింది.

నేను పంజాబీని.. ఇన్నాళ్లు పంజాబీ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఈ సినిమా తర్వాత ఆ తెలుగు సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోందని రాశి చెప్పుకొచ్చింది. తెలుగు పద్ధతులు నాకు చాలా బాగా నచ్చాయని కితాబిచ్చింది.

‘ఇన్నాళ్లు నాకు తెలుగు సంప్రదాయాల గురించి తెలియవు. కానీ ఈ సినిమా చేసినన్ని రోజులు – మరీ ముఖ్యంగా అమలాపురంలో షూటింగ్ జరిగిన తర్వాత నేను బాగా మారిపోయానని’ రాశి తెలిపింది. ఎంతలా అంటే నాక్కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేసింది.