పేపర్ కవర్ పేజీపై కిల్లర్ లుక్

0

మన తెలుగు భామలకు ఎందుకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావు? ఒక కారణం ఏంటంటే హాట్ ఇమేజ్ ఉండదు. బాలీవుడ్ ముద్దుగుమ్మలంత సహజంగా మన భామలు గ్లామర్ పొజులు ఇవ్వలేరు. అదే రాధిక ఆప్టేను ఉదాహరణగా తీసుకోండి. హాట్ ఫోటో షూట్ ఉంది అని చెప్తే చాలు.. కెమెరా పర్సన్ రెడీ అయ్యి ఫోకస్.. లైటింగ్ సెట్ చేసుకొనేలోపు హాటు పోజులో రెడీ గా కూర్చొని ఉంటుంది. జస్ట్ కిడ్డింగ్.. అంత ఫాస్ట్ గా ఉంటుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం.

తాజాగా ఈ బ్యూటీ ‘పేపర్’ అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. పేపర్లు.. అట్ట.. పంచింగ్ మిషను..ఏంటి ఈ పేర్లు? మేమెప్పుడూ వినలేదు అని కోపం తెచ్చుకోకండి.. మనకు ఆ మ్యాగజైన్ పేరు ముఖ్యమా లేక రసగుల్లా లాంటి బ్యూటీ ఫోటో షూట్ ముఖ్యమా? అందుకే పేపర్ సంగతి పక్కన పెట్టి ఆ మ్యాగైజన్ కోసం ఇచ్చిన పోజు గురించి మాట్లాడుకుందాం. ఒక మెరూన్ కలర్ థై స్లిట్ గౌన్ ధరించి అందాలరాణిలా రెండు చేతులను నడుముపై ఉంచి నిలబడింది. ఒక కాలును వుడెన్ స్టూల్ పై పెట్టింది. ఫుల్ స్లీవ్స్ ఉన్న ఆ గౌన్ కు డీ…ప్ గా ఉన్న వీ నెక్ ఉంది. మెడలో సన్నటి చైన్ కూడా ఉంది. తన డ్రెస్ కు మ్యాచింగ్ అన్నట్టుగా మెరూన్ కలర్ లిప్ స్టిక్.. లూజ్ హెయిర్.. ఉండడంతో ఒక మోడల్ లాగ ఉంది.

డ్రెస్ ను చూస్తుంటే కేన్స్ ఫెస్టివల్స్ లో ముద్దుగుమ్మలు వేసుకుంటారు చూడండి.. సరిగ్గా అలా ఉంది. డ్రెస్ కు తగ్గట్టు కాన్ఫిడెంట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. నెటిజనులకు ఈ ఫోటో తెగ నచ్చింది. ఒకరు “సూపర్ యాటిట్యూడ్.. కిల్లర్ లుక్స్” అన్నారు. ఒక నెటిజనుడు “సడెన్ గా చూసి ఐశ్వర్య రాయ్ అనుకున్నా” అన్నాడు. మరో నెటిజనుడు “దయచేసి టెంపరేచర్లు పెంచొద్దు ప్లీజ్” అన్నాడు. ఎవరెన్ని చెప్పినా ఒకటి నిజం.. ఏ డ్రెస్ వేసుకున్నా దానికి తగ్గ యాటిట్యూడ్ తో పోజివ్వడం మాత్రం రాధిక స్పెషాలిటి. రాధిక ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే.. ‘ది ఆశ్రమ్’..’ది వెడ్డింగ్ గెస్ట్’ అనే ఇంగ్లీష్ సినిమాలలో నటిస్తోంది.
Please Read Disclaimer