న్యూడ్ వీడియో లీక్.. రాధిక రియాక్షన్

0

బాలీవుడ్ సంచలన హీరోయిన్ రాధిక ఆప్టే సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పుడు మీడియాలో ఉంటూనే వస్తోంది. ఆ మద్య సౌత్ సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సంచలనం సృష్టించిన రాధిక ఆప్టే జాతీయ స్థాయి మీడియాలో ఏదో ఒక విషయంలో కవరేజ్ అవుతూనే వస్తోంది. తాజాగా మరోసారి ఈమె మీడియా ముందుకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం ఈమె న్యూడ్ వీడియోలు లీక్ అయిన విషయం తెల్సిందే. ఒక షార్ట్ ఫిలిం కోసం తీసిన వీడియో లీక్ అవ్వడంతో అంతా కూడా షాక్ అయ్యారు.

ఆ న్యూడ్ వీడియో గురించి తాజాగా రాధిక ఆప్టే ఒక టాక్ షో లో మాట్లాడుతూ.. మొదట నా డ్రైవర్ ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత మా అమ్మ నాకు ఆ వీడియోను పంపితే చూశాను అంది. ఆ వీడియో చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటీ అంటూ హోస్ట్ ప్రశ్నించిన సమయంలో రాధిక చాలా లైట్ ఆన్సర్ ఇచ్చింది. ఒక నవ్వు నవ్విన రాధిక అలాంటి విషయాలను నేను గాని నా కుటుంబ సభ్యులు గాని పెద్దగా పట్టించుకోం. అలాంటి లీక్ లు నా జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయలేవు.

కెరీర్ ఆరంభంలో మీడియాలో వార్తలు మరియు ఇతర విషయాలు కాస్త ఇబ్బంది కలిగించేవి. కాని ఇప్పుడు అలా ఏం లేదు. ఇలాంటి విషయాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను అంది. న్యూడ్ వీడియోలు లీక్ అయితే మరీ ఇంత లైట్ గా తీసుకోవడం ఏంటో ఆమెకే తెలియాలి. ఆమె రియాక్షన్ చూస్తుంటే ఆ వీడియో ఆమె కావాలని లీక్ చేయించుకుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాధిక ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్ లో అడపా దడపా నటిస్తోంది. సౌత్ కు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటూ వస్తోంది.
Please Read Disclaimer