కాస్త ఘాటుగా రాధిక!

0

బాలీవుడ్లో చాలామంది బ్యూటీలే ఉన్నారు గానీ వాళ్ళందరిలో రాధిక ఆప్టే రూటే సెపరేటు. నటనతో అందరినీ మెప్పించడమే కాకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదం తో సావాసం చెయ్యడం ఆమె ప్రత్యేకత. ఇక హాటు ప్రదర్శనలు.. న్యూడ్ వీడియోలో లీక్ కావడం లాంటి వాటితో రాధిక ఇమేజ్ ఎప్పుడూ ఘాటే.

ఈమధ్య రాధిక ఆప్టే మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిచ్చింది. లిమిటెడ్ ఎడిషన్ గా రిలీజ్ అయిన ఈ నవంబర్ నెల మ్యాగజైన్ కు తన హాట్నెస్ తో కొత్త అందాన్ని తీసుకొచ్చింది. డార్క్ కలర్ లెదర్ టాప్ ధరించి ఫ్రంట్ జిప్ కాస్త కిందకు తీసి తన క్లీవేజ్ సోకులను ధారపోసింది. సన్నగా చేతిగాజుల సైజ్ లో ఉన్న ఇయర్ రింగ్స్ తో కాస్త గజిబిజిగా అనిపించే హెయిర్ స్టైల్ తో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

ఈ ఫోటో ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ మ్యాగ్జిమ్ వారు ఇలా క్యాప్షన్ ఇచ్చారు..”ఆమె ప్రత్యేకం… ఆ ప్రత్యేకతతోనే తన కెరీర్ ను నిర్మించుకుంది. నవంబర్ ఇష్యూ తో రాధిక మ్యగ్జిమ్ డెబ్యూ ఇచ్చింది”. రాధిక సినిమాల విషయానికి వస్తే రెండు ఇంగ్లీష్ మూవీస్.. ఒక తమిళ చిత్రం.. మరో హిందీ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
Please Read Disclaimer