హీరో చెంప పగలగొట్టిన రాధికా ఆప్టే..

0ఏదో ఒక వార్త తో మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచే రాధికా ఆప్టే మరోసారి వార్తలు నిలిచింది. గతం లో సినిమా హీరోయిన్స్ పై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని మీడియా ముందు ప్రకటించి సంచలనం సృష్టించిన ఈ భామ, తాజాగా ఓ షో లో మాట్లాడుతూ సౌత్ హీరో చెంప పగలగొట్టనని తెలిపి వార్తల్లో నిలిచింది.

బాలీవుడ్‌ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్‌ షో వోగ్ బీఎఫ్‌ఎఫ్‌కు రాధిక ఆప్టే ముఖ్య అతిథిగా వెళ్లింది. ఈ కార్య క్రమం లో మాట్లాడుతూ మొదటి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా సెట్‌కి వెళ్లిన మొదటి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు.. తన కాలిని అసభ్యంగా రుద్దడం మొదలు పెట్టాడని,దాంతో కోపంతో అతడి చెంప చెళ్లుమనిపించానని రాధిక తెలిపింది.

తెలుగులో ఈమె బాలకృష్ణతో లెజెండ్‌, లయన్‌.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతో పాటు తమిళంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాలో నటించింది. మరి రాధికా చేత చెంప దెబ్బ తిన్న ఆ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.