దర్శకేంద్రుడు సినిమా కాదు – వెబ్ సిరీస్!

0

శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ మద్య కాలంలో మెగా ఫోన్ పట్టుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్బుతమైన చిత్రాలను అందించిన రాఘవేంద్ర రావు దర్శకత్వం చేయకపోవడంతో ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మద్య రాఘవేంద్ర రావు ఒక చిన్న చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని – కోటి లోపు బడ్జెట్ తో అంతా కొత్త వారితో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని ప్రస్తుతం రాఘవేంద్ర రావు వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ప్రస్తుతం చిన్నా – పెద్దా అనే తేడా లేకుండా అంతా కూడా వెబ్ సిరీస్ లపై పడుతున్నారు. ప్రముఖ నిర్మాతలు – దర్శకులు కూడా వెబ్ సిరీస్ లను చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఈ సమయంలో రాఘవేంద్ర రావు కూడా ప్రముఖ సంస్థ రిలయన్స్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్దమయినట్లుగా సమాచారం అందుతుంది. రిలయన్స్ తో రాఘవేంద్ర రావు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడట. అయితే ఆ వెబ్ సిరీస్ కు దర్శకేంద్రుడు దర్శకత్వం వహిస్తారా లేదంటే తన శిష్యులతో తన పర్యవేక్షణలో తెరకెక్కిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. రాఘవేంద్ర రావు వెబ్ సిరీస్ ఎప్పుడు ఉంటుంది – ఎలా ఉంటుందనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రాఘవేంద్ర రావు సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే. వెబ్ సిరీస్ తర్వాత అయినా రాఘవేంద్ర రావు సినిమాను తెరకెక్కిస్తారని ఆశిద్దాం.
Please Read Disclaimer