ఏపీకో హోదా: మోడిపై రాహుల్ ఫైర్

0కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీ సమావేశాలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు ప్రసంగించారు. యావత్ దేశం అసంతృప్తితో ఉందని అన్నారు. ఎన్డీయే పాలనలో యువత ఆగ్రహంతో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లీనరీలో తీర్మానం చేశారు. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారని… ఒక ప్రధాని ఇచ్చిన హామీలను కూడా ఎన్డీయే విస్మరించిందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి స్పెషల్ స్టేటస్ తో పాటు… విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.