‘అర్జున్ రెడ్డి’ కమెడియన్ ఆసక్తికర ప్రకటన

0

‘అర్జున్ రెడ్డి’ చిత్రం విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రం కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే కాకుండా దర్శకుడు సందీప్ హీరోయిన్ షాలిని పాండేలతో పాటు కమెడియన్ రాహుల్ రామకృష్ణకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఆ చిత్రం తర్వాత రాహుల్ రామకృష్ణ పలు చిత్రాల్లో నటించి తన కామెడీతో అలరించి మరింత క్రేజ్ ను దక్కించుకున్నాడు. తాజాగా ‘మిఠాయి’ అనే చిత్రంతో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సినిమాలతో – వెబ్ సిరీస్ లతో వరుసగా షూటింగ్స్ అంటూ బిజీగా గడుపుతున్న రాహల్ రామకృష్ణ తాజాగా ఒక పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పిక్ లో ఒక లేడీతో రామకృష్ణ ఉన్నాడు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఆమె ఎవరు – ఏం చేస్తుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తమ పెళ్లి జనవరి 15న జరుగబోతున్నట్లుగా ప్రకటించాడు. సోషల్ మీడియాలో పెళ్లి గురించి చెప్పిన వెంటనే రాహుల్ రామకృష్ణ ఫాలోవర్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్ వివాహం చేసుకోబోతున్న అమ్మాయి ఎవరా అంటూ నెట్ లో సెర్చింగ్ లు మొదలు పెట్టారు. కమెడియన్ గా దూసుకు పోతున్న రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Please Read Disclaimer