ఇంకో ప్రొడ్యూసర్ కొడుకు ఇండస్ట్రీలోకి

0ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారిలో వారసత్వం ఉన్నవారికి ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పటిలో ఇండస్ట్రీలో లోటుపాట్లు తెలియడంతోపాటు ఛాన్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. హీరోగా లాంచ్ అవడానికి కావాల్సిన అన్ని టాలెంట్లు వంట పట్టించుకుని ఓ మంచి ముహూర్తం చూసుకుని షూటింగ్ మొదలుపెట్టేయొచ్చు.

పెళ్లిచూపులు సినిమా తక్కువ బడ్జెట్ లోనే మంచి హిట్ కొట్టాడు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి. ఈ మూవీ మంచి లాభాలతోపాటు నేషనల్ అవార్డ్ కూడా తెచ్చిపెట్టింది. ఈ ప్రొడ్యూసర్ కు ఇండస్ట్రీ బాగా నచ్చినట్టుంది. అందుకే తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నాడు. రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి అమెరికాలో చదువులు పూర్తి చేసి ఇండియాకి తిరిగొచ్చాడు. ఇక్కడకు వచ్చేముందే హీరోగా రాణించడానికి అవసరమైన యాక్టింగ్ – డ్యాన్స్ – ఫైట్స్ లో బాగా ట్రయినింగ్ తీసుకుని వచ్చాడట.

ప్రస్తుతం తన కొడుకును హీరోగా లాంచ్ చేయడానికి సరిపడా మంచి స్టోరీ కోసం రాజ్ కందుకూరి వెతుకుతున్నారు. ఇప్పటికే స్క్రిప్టులు వినడం కూడా మొదలుపెట్టేశారు. సబ్జెక్టు ఓకే అయితే సినిమా మొదలెట్టేయడానికి రెడీగానే ఉన్నాడు. ఇంతకుముందు ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తన కొడుకు సాయి శ్రీనివాస్ ను హీరో చేశాడు. అదే స్టయిల్ లో శివ కందుకూరిని కూడా క్లిక్ అయ్యేలా చేయాలన్నది రాజ్ కందుకూరి ఆలోచన.