ఫ్యాన్స్‌కి కిక్.. ‘రాజా రాజా రాజా ది గ్రేటురా’.. సాంగ్ కేక..

0మాస్ మహారాజా నటిస్తున్న తాజా చిత్రం “రాజా ది గ్రేట్”. ఈ చిత్రంలో హీరో రవితేజ దివ్యాంగుడిగా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

“రాజా రాజా రాజా ది గ్రేటురా.. నువ్వు తల తల టూతౌజన్డ్ నోటురా నోటురా..” అంటూ సాగే సాంగ్ మాస్ మహారాజా అభిమానులకి కిక్ ఎక్కిస్తోంది. రూ.2000 నోటు, వరల్డ్ బ్యాంక్ అంటూ సాగుతుండగా మధ్యలో రవితేజ వాయిస్ అందించడంతో పాటకు మాంచి జోష్ వచ్చింది.

ఇక ఈ సాంగ్ రికార్డింగ్ వీడియోను కూడా చిత్రయూనిట్ వీడియోలో చూపించింది. ఓవైపు పాట కొనసాగుతుండగా శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ అనిల్ రావిపూడి డబ్బు వాయిస్తూ చిందులు వేసి ఫ్యాన్స్‌ను హుషారెత్తిస్తున్నారు. సాయి కార్తీక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను రేవంత్, సాకేత్, రవితేజ పాడారు.