మహాభారతం: జక్కన్నకు లైన్ క్లియర్

0

అవును.. జక్కన్నకు లైన్ క్లియరైంది. ప్రపంచదేశాలు కన్నేసిన భారతీయ పురాణేతిహాసం `మహాభారతం`ను బిలియన్ డాలర్ బిజినెస్ ట్రాప్ లోకి లాగేందుకు వెండితెర విజువల్ వండర్ని ఆవిష్కరించేందుకు జక్కన్నకు లైన్ క్లియర్ అయ్యింది. ఇది పక్కా నిజం. ఎందుకంటే అసలు `మహాభారతం`ను తెరకెక్కించాలంటే దమ్ము కావాలి. డబ్బును మించి గట్స్ కావాలి. కానీ అది బాలీవుడ్ వాళ్లకు – మల్లూవుడ్ వాళ్లకు చేతకాని పనే అయ్యింది. ఆశ పడ్డారు కానీ – వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. సనాతన సాంప్రదాయాలకు – యుక్తులు – కుయుక్తులు – అన్నదమ్ములు రాజకీయాలకు ఆలవాలం అయిన `మహాభారతం`ను తెరకెక్కించే ఛాన్స్ ఇప్పుడు రాజమౌళి ముంగిటకు వచ్చింది.

ఎందుకంటే.. ఈ భారీ ప్రాజెక్టు పేరుతో వందల కోట్లు వెచ్చించేందుకు వాళ్లను నమ్మి ఎవరూ ముందుకే రాలేదు. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అంతటివాడే `మహాభారతం` చిత్రాన్ని ఐదు భాగాలుగా తీస్తానంటే రిలయెన్స్ అంబానీలే వెనక్కి జంకారు. 1000 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తామని చెప్పి తర్వాత టాటా చెప్పేశారు. తాజాగా మోహన్ లాల్ ప్రకటించిన 1000 కోట్ల `మహాభారతం` సైతం సందిగ్ధంలోనే పడింది. రైటర్ వాసుదేవన్ ఏకంగా మోహన్ లాల్ – మీనన్ బృందంపై విరుచుకుపడ్డారు. నాలుగేళ్లయినా అతీ గతీ లేదు. దిక్కు లేదు. తికాణా లేదు.. వీళ్లేం తీస్తురులే అంటూ తిట్టి పోశారు. దీంతో ఇక్కడా లైన్ క్లియరైంది.

అంటే బాలీవుడ్లో `3డి మహాభారతం` తూచ్.. మాలీవుడ్ లో `1000 కోట్ల మహాభారతం` తూచ్! అని తేలిపోయింది. అయితే ఇక్కడ వేరొక కోణాన్ని పరిశీలించాలి. టాలీవుడ్ దర్శకధీరుడు .. ది గ్రేట్ ఎస్.ఎస్.రాజమౌళి `బాహుబలి` సిరీస్ తీసి 2000 కోట్లు కొల్లగొట్టడంతో నోట మాట రాని బాలీవుడ్ వాళ్లు – మాలీవుడ్ వాళ్లు – ఇరుగు పొరుగు పరిశ్రమల వాళ్లు `మహాభారతం` ఛాన్స్ మన జక్కన్నకు దక్కకుండా చేయాలని అనుకున్నారు. `బాహుబలి` ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో జాతీయ మీడియా లైవ్ లో `మహాభారతం` నా డ్రీమ్ అని రాజమౌళి ప్రకటించగానే వీళ్లంతా తొట్రుపడ్డారు. ఆ ఛాన్స్ అతడికి ఇచ్చేస్తే ఎలా అని కుళ్లుకున్నారు. ఆ క్రమంలోనే ఆదరాబాదరాగా `మహాభారతం` తెరకెక్కించేస్తామని ఎవరకివారు తామరతంపరగా ప్రకటనలు గుప్పించేశారు. అమీర్ ఖాన్ – మోహన్ లాల్ కంగారు పాటు వెనక తొట్రుపాటు కూడా అంతే ఉందని తాజా సన్నివేశం చెబుతోంది. ప్రకటనలు ఘనం.. పనులు శూన్యం! అన్న చందంగా వీళ్ల పరిస్థితి ఉంది. అందుకే ఎస్.ఎస్.రాజమౌళి వీళ్లందరికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. లాల్ కి – అమీర్ కి దిమ్మ తిరిగేలా `మహాభారతం 3డి` అంటూ ఠెంకాయ కొట్టి షాకివ్వాల్సిన సందర్భమిదే. ఒకవేళ ఇదే జరిగితే మరోసారి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ఒణుకు మొదలవ్వడం గ్యారెంటీ. బాక్సాఫీస్ గజగజగజకు తెరతీసినట్టే అవుతుంది. మరి మన జక్కన్న ఏం చేస్తాడో చూడాలి.
Please Read Disclaimer