ఎంపీ కవిత చాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి

0హరితహారం.. మొక్కను బతికిస్తే అది మనల్ని బతికిస్తుంది. ఇంత మంచి కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకువెళుతోంది. ఇప్పటివరకు విద్యార్థులు ప్రజలు అధికారులు ఈ కార్యక్రమంలో గడిచిన నాలుగేళ్లుగా పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఇది ఇంకా ఫేమస్ కావాలంటే సినీ సెలబ్రెటీలు రావాలి.. వారు ఇందులో పాల్గొంటేనే విశేష ప్రాచుర్యం దక్కుతుంది. అందుకే సీఎం కేసీఆర్ కూతురు – ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా ఫిట్ నెస్ చాలెంజ్ లాగే ‘ గ్రీన్ చాలెంజ్’ విసిరారు.

కొద్దిరోజుల క్రితమే కవిత కొన్ని మొక్కలు నాటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఈ గ్రీన్ చాలెంజ్ విసిరారు. రాజమౌళితోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ – క్రీడాకారిణి సైనా – ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు మొక్కలు నాటి ప్రపంచాన్ని హరితం చేయాలని సవాల్ విసిరారు.

తాజాగా ఈరోజు ఎంపీ కవిత విసిరిన సవాల్ ను దర్శక ధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా మర్రి గుల్మోహర్ మలబారు వే చెట్టులను తన ఫామ్ హౌస్ లో నాటిన రాజమౌళి.. దానికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనంతరం ఈ గ్రీన్ చాలెంజ్ ను రాజమౌళి కూడా కొంత మందికి విసిరారు.. మంత్రి కేటీఆర్ బ్యాడ్మింటర్ కోచ్ గోపీచంద్ – దర్శకులు సందీప్ రెడ్డి వంగ – నాగ్ అశ్విన్ లను మొక్కలు నాటాలని చాలెంజ్ చేశారు. ఇలా ‘గ్రీన్ చాలెంజ్’ ప్రస్తుతం హరితహారం స్ఫూర్తిని చాటుతూ తెలంగాణలో దూసుకుపోతోంది. అందరు ప్రముఖులు పాల్గొంటూ విజయవంతంగా సాగుతోంది.