‘భరత్ అనే నేను’పై దర్శక ధీరుడి ప్రశంసలు !

0మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది. ఉదయం తొలి షో నుండే సినిమాకు మంచి పాజిటివ్ టాక్ బయలుదేరింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే సెలబ్రిటీలు సైతం చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఉదయం సినిమాను వీక్షించిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చిత్రంలో మహేష్ బాబు నటన అద్భుతంగా ఉందని, ఒక కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ (స్వయం పాలన) వంటి అంశాన్ని గురించి ఎంతో చక్కగా చెప్పారని, ఇది దర్శకుడు కొరటాల శివ గొప్పతనమని, ముఖ్యంగా ప్రెస్ కాన్ఫరెన్స్ సన్నివేశమైతే చాలా బాగుందని అన్నారు. అలాగే ఇతర దర్శకులు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బివిఎస్.రవి, వంశీ పైడిపల్లి వంటి వారు కూడ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు.