రాజమౌళి నాస్తికుడని మీకు తెలుసా?

0Rajamouli-New-Picబాహుబలి1 మూవీలో శివలింగం సీన్.. ఆ సీన్ లో భక్తి ప్రపత్తులు.. చూస్తున్నప్పుడు కలిగే ఎమోషన్స్.. వీటన్నిటినీ చూసిన వారికి ఎవరైనా.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నాస్తికుడు అని అనిపిస్తుందా.. కనీసం అనుకోగలరా.. కానీ అదే వాస్తవం. ఈ విషయం వేరెవరో కాదు.. నాస్తికుడిని అంటూ స్వయంగా తనే చెప్పాడు రాజమౌళి.

బాహుబలి2 రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు దర్శకధీరుడు. అంతేకాదు.. తాను నాస్తికుడిగా మారడానికి కారణాలు కూడా చెప్పాడు. ‘ఇదేమీ రాత్రికిరాత్రి జరిగిపోలేదు. టీనేజ్ లో ఉన్నపుడు నేను బాగా సాంప్రదాయాలు పాటించి.. కాషాయం కట్టుకు తిరిగేవాడిని. చర్చిలకు వెళ్లి సందేశాలను వినేవాడిని. ఎంత భక్తి మార్గంలో ఉన్నా నాకు నేను సంతోషంగా భావించలేకపోయేవాడిని. ఆ వాతావరణం అంతా సంతృప్తిని ఇచ్చేది కాదు’ అని చెప్పాడు జక్కన్న.

‘కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాను. నాస్తికుడైన గుణ్ణం గంగరాజుతో కలిసి పని చేశఆను. ఆయన అయాన్ ర్యాండ్ రాసిన ఫౌంటెన్ హెడ్ పుస్తకం ఇఛ్చారు. అయాన్ ర్యాండ్ సిద్ధాంతాలను పూర్తిగా ఫాలో అయిపోతానని కాదు కానీ.. మెల్లకు అది నన్ను మార్చింది. అలాగే.. నా వ్యక్తిత్వాన్ని.. ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపింది’ అని చెప్పాడు రాజమౌళి.