డేట్స్ ఫిక్స్ చేసిన రాజమౌళి

0ఓ సినిమా చేయడానికి మినిమం ఏడాది గ్యాప్ తీసుకుంటాడు రాజమౌళి. అలాంటిది మల్టీస్టారర్ మూవీ అంటే ఈ దర్శకుడు ఇంకెంత గ్యాప్ తీసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బాహుబలి-2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. ఈ ఏడాది చివరి వరకు అదే గ్యాప్ ను మెయింటైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఈ గ్యాప్ లో తన సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని పూర్తిచేయబోతున్నాడు.

చరణ్, తారక్ ను హీరోలుగా పెట్టి రాజమౌళి ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫైనల్ నెరేషన్ పూర్తయింది. హీరోలిద్దరికీ రాజమౌళి స్క్రీన్ ప్లే మొత్తం చెప్పేశాడు కూడా. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కాల్షీట్ల వ్యవహారం తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్, చెర్రీ ఇద్దరూ బిజీగా ఉన్నారు. దీంతో ఇద్దర్నీ కలిపి షూట్ చేసే సన్నివేశాలకు టైం పట్టేలా ఉంది.

అందుకే కాస్త ముందుగానే రాజమౌళి మేల్కొన్నాడు. నవంబర్ నుంచి ఎన్టీఆర్ కాల్షీట్లు తీసుకున్నాడు. ఎన్టీఆర్ సోలో సన్నివేశాల్ని చిత్రీకరిస్తాడు. ఇక డిసెంబర్ నుంచి చరణ్ కాల్షీట్లు తీసుకున్నాడు. చెర్రీ సెట్స్ పైకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్-చరణ్ కాంబోలో ఉన్న సీన్లు పూర్తిచేస్తాడు రాజమౌళి. ఆ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అప్పుడు చరణ్ తో సోలో సన్నివేశాలు తీస్తాడు రాజమౌళి. ఈ మేరకు డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిలింసిటీలో ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి.