క్రిష్, బాలయ్యలపై రాజమౌళి కామెంట్

0Rajamouli-and-krishఏడాది కిందట నందమూరి బాలకృష్ణతో క్రిష్ సినిమా చేయబోతున్నాడని వార్త బయటికి వచ్చినపుడు చాలామంది నమ్మలేదు. ఇది గాలి కబురు అనుకున్నారు. ఎందుకంటే బాలయ్య పక్కా మాస్ మసాలా సినిమాలు చేస్తుంటాడు. క్రిష్ క్లాస్ టచ్ ఉన్న సందేశాత్మక సినిమాలు తీస్తుంటాడు. వీళ్లిద్దరికి లంకె కుదురుతుందని ఎవరూ అనుకోలేదు. మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఇలాగే ఆలోచించాడట. క్రిష్-బాలయ్యల కాంబినేషన్ బాగోదని అనుకున్నాడట. అసలు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారనగానే అది ఫ్లాప్ అని కూడా ఫిక్సయిపోయినట్లు రాజమౌళి ఓపెన్ గా చెప్పేశాడు.

‘‘బాలయ్య గారి వందో సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడనగానే చాలామంది లాగే నాకు కూడా ఏదోలా అనిపించింది. బాలయ్య లాంటి మాస్ హీరోను క్రిష్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఎలా చూపిస్తాడో అని సందేహించాను. ఈ సినిమా మీద అనుమానాలు నెలకొన్నాయి. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడమేంటి.. వీళ్లది బ్యాడ్ కాంబినేషన్ అని ఫీలయ్యాను. ఐతే కొన్నాళ్ల తర్వాత సాయి కొర్రపాటి గారు నన్ను కలిసి ఈ సినిమా గురించి చెప్పారు. క్రిష్ కథ చెప్పాడని.. చాలా బాగుందని.. అందులో రకరకాల ఎమోషన్లు ఉన్నాయని.. సినిమా ఆడేస్తుందేమో అని సందేహంగా ఉందని అన్నాడు. ట్రైలర్ చూశాక నా అభిప్రాయం కూడా మారింది. సినిమా చూశాక అద్భుతంగా అనిపించింది. నాతో పాటు అందరి అభిప్రాయం తప్పని క్రిష్ నిరూపించాడు’’ అని క్రిష్ తో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో రాజమౌళి అన్నాడు.

loading...