రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు కాదట

0Rajamouli-New-Picబాహుబలి బాక్స్ ఆఫీస్ రికార్డుల దెబ్బకు రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ రాజు అయిపోయాడు అనడంలో ఎలాంటి తప్పు లేదు. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఆయన సినిమా రాజ్యంలో ఒక చిన్న సైనికుడి పాత్ర దొరికినా చాలు అనుకుంటున్నారు. గత కొంత కాలంగా దర్శకధీరుడు తన నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తాడు అనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. బాలివుడ్ – కోలీవుడ్ మీడియా కూడా టాలీవుడ్ వైపు ఓ కన్నేసి ఉంచింది.

అయితే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని ఓ మెగా హీరోతో ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇటీవల రాజమౌళి మెగా స్టార్ట్ “సైరా” ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో ఆ అనుమానాలు ఇంకా బలపడ్డాయి. బాహుబలి లాంటి సినిమా తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతుండడంతో జక్కన్న కూడా వారి స్వాగతాన్ని గౌరవించి వెళ్ళాడు. కానీ అలా వెళ్ళడంతో చరణ్ తో అల్లు అర్జున్ తో సినిమాలను చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే సన్నిహితులు మాత్రం ఇలాంటి న్యూస్ ను రూమర్లంటూ కొట్టిపాడేస్తున్నారు.

రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను మెగా హీరోలతో చేయడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పైగా మెగా హీరోలందరూ కూడా 2019 వరకు బిజీగా ఉన్నట్లు వారి షెడ్యూల్ చూస్తే మనకు తెలిసింది. ప్రస్తుతం వారు 2 నుంచి 3 కథల వరకు కమిట్ అయ్యరు.. అవి అయిపోయేవరకు వేరే సినిమాలను ఒప్పుకోని పరిస్థితి. మరి జక్కన్న మెగా హీరోలతో పనిచేయడం కష్టమే కదా!!